భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘన

  పాకిస్థాన్ తీవ్ర ఆరోపణ ఇండియన్ డిప్యూటీ హై కమిషనర్‌కు నాలుగోసారి సమన్లు ఇస్లామాబాద్: భారత సైనిక దళాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ పాకిస్థాన్ భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లూవాలియాకు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ‘హాట్ స్ప్రింగ్, చిరికోట్ సెక్టార్లలో ఆగస్ట్ 18న ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని దక్షిణాసియా సార్క్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైజల్ ఖండించారు’ అని […] The post భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పాకిస్థాన్ తీవ్ర ఆరోపణ
ఇండియన్ డిప్యూటీ హై కమిషనర్‌కు నాలుగోసారి సమన్లు

ఇస్లామాబాద్: భారత సైనిక దళాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ పాకిస్థాన్ భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లూవాలియాకు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ‘హాట్ స్ప్రింగ్, చిరికోట్ సెక్టార్లలో ఆగస్ట్ 18న ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని దక్షిణాసియా సార్క్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైజల్ ఖండించారు’ అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. కాల్పుల సంఘటనలో వయసు మళ్లిన ఇద్దరు వృద్ధులు మరణించగా,ఏడేళ్ల పిల్లవాడు గాయపడ్డాడని పేర్కొంది. ‘2017 నుంచి 1,970 పర్యాయాలు భారత దళాలు కనీవినీ ఎరగని రీతిలో మితిమీరి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయి’ అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న ఫైజల్ ఆరోపించారు.

భారతీయ దళాలు ఉద్దేశపూర్వకంగా… జనావాస ప్రాంతాలను లక్షంగా చేసుకోవడం బాధాకరం. మానవీయ విలువలకు, అంతర్జాతీయ మానవ హక్కులకు, మానవతా చట్టాలకే విరుద్ధం అని కూడా ఆయన అన్నారు. ‘2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించండి. దీనిపైన, గతంలో జరిగిన ఉల్లంఘనలపైన దర్యాప్తు జరపండి. కాల్పుల విరమణను పాటించమని భారత దళాలకు ఆదేశాలివ్వండి. నియంత్రణ రేఖపైన, సరిహద్దుపైన శాంతిని పాటించండి’ అని ఫైజల్ భారతదేశాన్ని కోరినట్టు విదేశాంగ కార్యాలయం తెలిపింది. భారత డిప్యూటీ హై కమిషనర్ అహ్లూవాలియాకు పాకిస్థాన్ సమన్లు జారీచేయడం వారం రోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి.ఈ నెలలో 14,15,16 తేదీల్లో కూడా కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి పాకిస్థాన్ నుంచి సమన్లు అందాయి.

Pak summons India deputy High Commissioner for 4th time

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: