భారత్ యుద్ధానికి దిగితే…మేమూ సిద్ధమే…

Pak President Arif Alviఇస్లామాబాద్ : జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదం పెరిగితే తమ బాధ్యత కాదని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తేల్చి చెప్పారు. కశ్మీర్ వ్యవహారంలో భారత రాజ్యాంగంలో మార్పులు జరిగితే, ఆ దేశంలో తీవ్రవాదం పెరిగే అవకాశం ఉందని, దీంతో తమకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కశ్మీర్ విషయంపై చేసిన తీర్మానాలను భారత్ పట్టించుకోకుండా తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు. భారత్ పాక్ పై దాడులు చేసే అవకాశం ఉందని, అయితే యుద్ధానికి పాక్ పూర్తి వ్యతిరేకంగా ఉందని ఆయన చెప్పారు. భారత్ యుద్ధానికి దిగితే, తాము వెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ నిప్పుల కుంపటిగా ఉందని, కశ్మీర్ అంశాన్ని ముందుపెట్టి భారత్ పాక్ పై కుయుక్తులు పన్నుతుందని ఆయన పేర్కొన్నారు.

Pak President Arif Alvi Comment on Jammu Kashmir Issue

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్ యుద్ధానికి దిగితే…మేమూ సిద్ధమే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.