చంద్రయాన్-2పై పాక్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Pak Minister

 

ఇస్లామాబాద్: చంద్రయాన్-2 విఫలం కావడంతో పాక్ మంత్రి ఇండియాపై విమర్శలు గుప్పించారు. చేతకాని పనికి ఎందుకు వెళ్లారంటూ ఇస్రోపై తన ట్విట్టర్‌లో పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేతకాని పనికి వెళ్లి ఎందుకు బొక్కబోపర్లాపడడం ఏంటని ఎద్దేవా చేశారు. ఇండియాను ఎండియా అని వ్యంగ్యంగా సంభోందించారు. పనికిరాని ప్రాజెక్టు కోసం రూ.900 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. దీంతో పాక్ మంత్రిని టార్గెట్ చేస్తూ భారతీయలు ట్రోల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యోమగామి అయినట్టు స్పీచ్‌ల మీద స్పీచ్‌లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో పాక్ నెటిజన్లు సదరు మంత్రికి ట్వీట్లతో చురకలంటించారు. మనం చేయలేని పని భారత్ చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి విమర్శిస్తారా? అని పాక్ నెటిజన్లు గడ్డి పెట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాక్ పరువు తీయొద్దని మంత్రికి పాక్ నెటిజన్లు వార్నింగ్ ఇచ్చారు. పైలట్ అభినందన్ ను వ్యొమగామిగా తయారు చేసి పంపిస్తామని అబుబాకర్ ఆర్ జె అనే నెటిజన్ ట్వీట్ తో పాక్ మంత్రిని హెచ్చరించారు.

 

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చంద్రయాన్-2పై పాక్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.