భారత హై కమిషనర్ ఇఫ్తార్‌పై కక్ష

అతిథులను తిప్పలు పెట్టిన పాక్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి ఇస్లామాబాద్ : స్థానిక భారతీయ హైకమిషనర్ ఏర్పాటు చేసిన విందుకు వచ్చిన అతిధులకు చేదు అనుభవం ఎదురైంది. భద్రతా అధికారులు వారిని ప్రశ్నలతో వేధించడం, వివరాలపై ఆరా తీయడం వంటి చర్యలతో అవమానించారు. పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ఆనవాయితీ ప్రకారం రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడి సెరెనా హోటల్‌లో శనివారం నాడు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. దీనికి పలువురు అధికారులను, జర్నలిస్టులను , అధికారులను ఆహ్వానించారు. […] The post భారత హై కమిషనర్ ఇఫ్తార్‌పై కక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అతిథులను తిప్పలు పెట్టిన పాక్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

ఇస్లామాబాద్ : స్థానిక భారతీయ హైకమిషనర్ ఏర్పాటు చేసిన విందుకు వచ్చిన అతిధులకు చేదు అనుభవం ఎదురైంది. భద్రతా అధికారులు వారిని ప్రశ్నలతో వేధించడం, వివరాలపై ఆరా తీయడం వంటి చర్యలతో అవమానించారు. పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ఆనవాయితీ ప్రకారం రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడి సెరెనా హోటల్‌లో శనివారం నాడు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. దీనికి పలువురు అధికారులను, జర్నలిస్టులను , అధికారులను ఆహ్వానించారు. ఈ లగ్జరీ హోటల్ చుట్టూ అసాధారణ రీతిలో భద్రతా వలయం ఉండటం, ఇఫ్తార్‌కు వెళ్లేందుకు వచ్చిన తమకు అటకాయింపులు ఎదురుకావడంతో వారంతా కంగుతిన్నారు. దీనితో చాలా ముంది లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లారు. భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు బెడిసికొడుతున్న ప్రస్తుత దశలో ఇక్కడి భారతీయ అధికారులు పలు రకాల అవమానాలకు గురవుతున్నారు. వారి కదలికలపై అప్రకటిత నిఘా పెట్టారు. తనను అనేక రకాలుగా ప్రశ్నించి, ఆహ్వాన పత్రాన్ని పదేపదే పరిశీలించి తరువాత లోపలికి పంపించారని ఒక జర్నలిస్టు చెప్పారు.

ఎక్కడుంటారు? ఏ వృత్తిలో ఉన్నారు? వంటి పలు ప్రశ్నలు వేశారని, హోటల్ చుట్టుపక్కల అంతా ఎప్పుడూ లేని విధంగా భద్రత ఉందని తెలిపారు. పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం వారు ఇక్కడికి వచ్చిన వారి పట్ల అవమానకరంగా వ్యవహరించారని , ఇది అసాధారణం, అంతకు మించి పనిగట్టుకుని వేధించడం అని ఈ జర్నలిస్టు మెహ్రీన్ జహ్రా మాలిక్ నిరసన వ్యక్తం చేశారు. వేధింపులతో ఇబ్బంది పెడుతారని ముందుగానే భావించి తాను విందుకు వెళ్లలేదని మరో జర్నలిస్టు చెప్పారు. కార్యక్రమానికి వెళ్లితే బాగుండదని ఆహ్వానితులలో కొందరికి అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌లు చేసినట్లు కూడా వెల్లడైంది. ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉత్సాహాన్ని కావాలనే చెడగొట్టినట్లుగా అన్పించిందని ఇక్కడికి వచ్చిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత ఫర్హతుల్లా బాబర్ చెప్పారు.

హోటల్ లాబీలోకి తేలిగ్గా ఎవరిని పోనివ్వలేదని, గేటు వద్దనే కొందరిని నిలిపివేసి, ఇఫ్తార్ లేదు ఇక ఇంటికి పోవచ్చునని బెదిరించినంత పనిచేశారని, అయితే తాను వారితో వాదించడంతో వేరే గేటు నుంచి పోవాలని అన్నారని, అక్కడికి పోయిన తరువాత ప్రధాన గేట్ నుంచి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారని, చాలా సేపటి వరకూ తనకు ఏమి జరుగుతుందో తెలియకుండా పోయిందన్నారు. అన్ని అడ్డంకులను తట్టుకుని తాను ఏదో విధంగా లోపలికి వెళ్లానని వివరించారు. ఇక ఇఫ్తార్‌కు ముందు హై కమిషనర్ బిసారియా సంక్షిప్తంగా మాట్లాడుతూ అతిధులు అంతా రాలేకపోయినట్లు తెలిసిందని, ఇక్కడికి వచ్చిన వారు కూడా నానా రకాల ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారని తెలిసిందని, ఇందుకు క్షమించాలని కోరారు.

Pak harass guests invited to Indian High Commission Iftar party

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత హై కమిషనర్ ఇఫ్తార్‌పై కక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: