కశ్మీర్ భారత్‌దే…ఐక్యరాజ్యసమితిలో పాక్ మంత్రి ప్రసంగం

జెనీవా: జమ్మూ కశ్మీర్ భారతదేశ రాష్ట్రం అని పాకిస్థాన్ తొలిసారిగా పేర్కొంది. మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో ప్రసంగం అనంతరం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, భారత దేశ రాష్ట్రం జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాకు, సంస్థలకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకూ వివిధ దశలలో పాకిస్థాన్ ఎక్కడ కూడా కశ్మీర్‌ను భారతదేశపు రాష్ట్రం అని పేర్కొనలేదు. ఎప్సుడూ భారత్ […] The post కశ్మీర్ భారత్‌దే… ఐక్యరాజ్యసమితిలో పాక్ మంత్రి ప్రసంగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


జెనీవా: జమ్మూ కశ్మీర్ భారతదేశ రాష్ట్రం అని పాకిస్థాన్ తొలిసారిగా పేర్కొంది. మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో ప్రసంగం అనంతరం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, భారత దేశ రాష్ట్రం జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాకు, సంస్థలకు ఎందుకు అనుమతిని ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకూ వివిధ దశలలో పాకిస్థాన్ ఎక్కడ కూడా కశ్మీర్‌ను భారతదేశపు రాష్ట్రం అని పేర్కొనలేదు. ఎప్సుడూ భారత్ ఏలుబడిలో ఉన్న కశ్మీర్ అనే పదం వాడుతూ వస్తోంది. దీనికి విరుద్ధంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఈ దశలో కశ్మీర్‌ను భారతదేశ రాష్ఠ్రంగా పేర్కొనడం కీలకంగా మారింది. దౌత్యవర్గాలను ఇది విస్మయపర్చింది.

కశ్మీర్‌లో పరిస్థితి బాగా ఉందని, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడానికి ఇండియా ప్రయత్నిస్తోందని ఈ విధంగా చిత్రీకరణ జరుగుతోందని, దీనిని హక్కుల సంస్థ గుర్తించి, ఈ విషయంపై ప్రపంచ స్థాయి స్పందనకు ఒత్తిడి తేవాలని ఖురేషీ చెపుతూనే ఈ క్రమంలో కశ్మీర్‌ను రాష్ట్రంగా పేర్కొన్నారు. ఆ భారత రాష్ట్రానికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతిని ఇవ్వడం లేదని, సామాజిక సంస్థలు, పత్రికలు ఇతర ప్రసార సాధనాల వారు చివరికి అంతర్జాతీయ సంస్థలను కూడా అక్కడికి వెళ్లనివ్వడం లేదని పేర్కొంటూ ఆయన భారత రాష్ట్ర ప్రస్తావన తీసుకువచ్చారు. కశ్మీర్‌లో పరిస్థితి బాగా లేదని పేర్కొంటూ తాను ఐరాస హక్కుల వేదిక నుంచి ఆవేదన వ్యక్తం చేశానని, ప్రపంచ దేశాలన్నీ దీనిపై స్పందించాలని కోరుకుంటున్నానని విలేకరులతో ఇష్టాగోష్టిలో ఖురేషీ చెప్పారు.

Pak Foreign Minister calls J&K an Indian State

The post కశ్మీర్ భారత్‌దే… ఐక్యరాజ్యసమితిలో పాక్ మంత్రి ప్రసంగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.