పాక్ క్రికెటర్ ఖాదీర్ కన్నుమూత

  ఇస్లామాబాద్: పాకిస్తాన్ లెగ్ స్పినర్ అబ్దుల్ ఖాదీర్ (63) కన్నుమూశాడు.  కరాచీలో తన ఇంట్లో గుండె పోటు రావడంతో ఆయనను  ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో ఖాదీర్ చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  ఖాదీర్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే అగ్ర శ్రేణి బ్యాట్స్ మెన్లు నానా తంటాలు పడేవారు. తనదైన రోజు ఖాదీర్ రెచ్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో  67 టెస్టుల్లో 236 వికెట్లు, 104 వన్డేల్లో 132 […] The post పాక్ క్రికెటర్ ఖాదీర్ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లెగ్ స్పినర్ అబ్దుల్ ఖాదీర్ (63) కన్నుమూశాడు.  కరాచీలో తన ఇంట్లో గుండె పోటు రావడంతో ఆయనను  ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో ఖాదీర్ చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  ఖాదీర్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయాలంటే అగ్ర శ్రేణి బ్యాట్స్ మెన్లు నానా తంటాలు పడేవారు. తనదైన రోజు ఖాదీర్ రెచ్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో  67 టెస్టుల్లో 236 వికెట్లు, 104 వన్డేల్లో 132 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ పై ఖాదిర్ బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 56 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు తీశాడు. సచిన్ టీమిండియాకు వచ్చిన కొత్తలోస పాక్ పై వీరవిహారం చేశాడు. ఖాదీర్ బౌలింగ్ లో సిక్స్ ల మోత మోగించాడు. ఖాదిర్ బౌలింగ్ లో సచిన్ వరసగా 6,0,4,6,6,6 కొట్టడంతో ఒకే ఓవర్లలో 28 పరుగులు రాబట్టాడు. అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ వెలుగులోకి వచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఖాదీర్ చీఫ్ సెలక్టర్ గా ఉన్నప్పుడు పాక్ టి-20 వరల్డ్ కప్ ను గెలుచుసుకుంది. అబ్దుల్ కు భార్య, నలుగురు తనయులు, ఒక కూతురు ఉంది. కూతురును పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఇచ్చి పెళ్లి చేశాడు.  ఖాదిర్ మృతిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని, దేశానికి ఎంతో సేవ చేశాడనని ఇమ్రాన్ కొనియాడారు. 

 

The post పాక్ క్రికెటర్ ఖాదీర్ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.