కశ్మీర్ పై హిందుత్వం రుద్దేందుకు యత్నం : పాక్ ఆర్మీ చీఫ్

ఇస్లామాబాద్ : జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత అవకాశం వచ్చిన ప్రతిసారి పాక్ భారత్ పై విషం కక్కుతోంది. పాక్ నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం సంయమనం పాటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ కీలక అజెండా కశ్మీర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని, కశ్మీరీలపై హిందుత్వాన్ని […] The post కశ్మీర్ పై హిందుత్వం రుద్దేందుకు యత్నం : పాక్ ఆర్మీ చీఫ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇస్లామాబాద్ : జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత అవకాశం వచ్చిన ప్రతిసారి పాక్ భారత్ పై విషం కక్కుతోంది. పాక్ నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం సంయమనం పాటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ కీలక అజెండా కశ్మీర్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని, కశ్మీరీలపై హిందుత్వాన్ని రుద్దేందుకు యత్నిస్తుందని, హిందుత్వ బాధితులుగా కశ్మీరీలు మారారని ఆయన ఆరోపించారు. కశ్మీర్ ను పాక్ ఒంటరిగా వదలదని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఆర్మీ ఎంతవరకైనా వెళుతుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విభజన అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, అయినప్పటికీ తాము శాంతినే కోరుకుంటున్నామని ఆయన తేల్చి చెప్పారు. కశ్మీరీల కోసం పాక్ ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కశ్మీరీల కోసం చివరి వరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని ఆయన వెల్లడించారు. కశ్మీరీలు భయాందోళనలకు గురి కావద్దని, వారికి తాము అండగా ఉంటామని జావెద్ బజ్వా స్పష్టం చేశారు.

Pak Army Chief Javed Bajwa Comments On Kashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్ పై హిందుత్వం రుద్దేందుకు యత్నం : పాక్ ఆర్మీ చీఫ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.