భారత్‌కు ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్

oxford vaccine arrives to India for Phase 2 and 3 trials

న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌కు వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్2, ఫేజ్3 ఔషధ ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డిసిజిఐ అనుమతులు ఇచ్చింది. కొవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ వ్యాక్సీన్ యుకెలో ఇప్పటికే విజయవంతంగా హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసింది. తమ పరిశోధనల్లో అద్భుత ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ రిజలట్స్‌ను ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ ’ది లాన్సెట్’లో ప్రచురించారు.

oxford vaccine arrives to India for Phase 2 and 3 trials

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post భారత్‌కు ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.