మిరియాలతో అధిక బరువుకు చెక్!

Black pepper

 

వంటల్లో ఉపయోగించే మసాలాలు రుచికోసమే కాకుండా, వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నల్ల మిరియాలను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల అవి కేలరీలను తగ్గించి, కొత్త కొవ్వు కణాలు రాకుండా చూస్తాయని’ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కెలతో పాటు మినరల్స్, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్ధమైన మెటబాలిక్ బూస్టర్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. 

సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతీరోజూ ఉదయం ఒకటీ రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు.

1. ఇలా చేస్తే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.
2. నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చు.
3. రోజూ తినే వెజిటబుల్ సలాడ్స్‌పైన వీటిని చల్లాలి. దీనివల్ల సలాడ్ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది.
4. చల్లదనం కోసం చేసే మజ్జిగపైన, పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా బ్లాక్‌పెప్పర్‌ను చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
5. గ్లాసు నీటిలో ఒక చుక్క ఒరిజినల్ బ్లాక్‌ పెప్పర్ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునే వారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను రోజువారీ ఆహారంలో చేరిస్తే మంచిది.

Overweight Prevention With Black pepper

Related Images:

[See image gallery at manatelangana.news]