పొంగి పొర్లుతున్న డ్రైనేజి నీరు…

  మియాపూర్ : మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీలో ఎక్కడికక్కడ మ్యాన్‌హోల్ నుంచి డ్రైనేజీ నీరు పొంగిపోర్లుతుంది. రోడ్లంతా మురుగునీరుతో పొంగిపోర్లుతూ కాలనీ మొత్తం డ్రైనేజీ మయంగా మారింది. దీంతో కాలనీ వాసులకు మురుగు కుంపటిగా మారింది. మురుగు నీటితో న్యూకాలనీ వాసులు నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జిహెచ్‌ఎంసి కమిషనర్ దాన కిషోర్ మ్యాన్‌హోల్‌పై రోడ్డుకు సరిమానంగా మ్యాన్‌హోల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసి చందానగర్ సర్కిల్ 21 అధికారులకు ఫిర్యాదు […] The post పొంగి పొర్లుతున్న డ్రైనేజి నీరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మియాపూర్ : మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీలో ఎక్కడికక్కడ మ్యాన్‌హోల్ నుంచి డ్రైనేజీ నీరు పొంగిపోర్లుతుంది. రోడ్లంతా మురుగునీరుతో పొంగిపోర్లుతూ కాలనీ మొత్తం డ్రైనేజీ మయంగా మారింది. దీంతో కాలనీ వాసులకు మురుగు కుంపటిగా మారింది. మురుగు నీటితో న్యూకాలనీ వాసులు నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జిహెచ్‌ఎంసి కమిషనర్ దాన కిషోర్ మ్యాన్‌హోల్‌పై రోడ్డుకు సరిమానంగా మ్యాన్‌హోల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసి చందానగర్ సర్కిల్ 21 అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. రోడ్లు గుంతలమయంగా మారడంతో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుందన్నారు.

మ్యాన్‌హోల్ మరమ్మత్తులు ఎక్కడ…
జిహెచ్‌ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఇటీవల మ్యాన్‌హోల్ మరమ్మత్తులకు ఆదేశాలు జారీ చేసిన మియాపూర్ న్యూకాలనీలో మ్యాన్‌హోల్ మరమత్తులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. రోడ్లు గుంతలమయంగా దానికితోడు డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారిపోయిందని కాలనీ వాసులు పేర్కోన్నారు. మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని న్యూకాలనీ ఉన్నా, పేరుకే న్యూకాలనీ కానీ కనీస వసతులకు కరువైయ్యింది. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు డ్రైనేజీ, రోడ్ల మరమ్మత్తులపై వినతి పత్రులు అందించిన స్పందన కరువైయ్యిందన్నారు. ఇప్పటికైన అధికారులు న్యూకాలనీ సమస్యలపై స్పందించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
మ్యాన్‌హోల్, రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి…
 కిరణ్ యాదవ్, మియాపూర్ డివిజన్ వార్డు మెంబర్
న్యూకాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారి కాలనీ ప్రజలందరికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాలనీ సమస్యల గురించి తెలియజేసిన ఫలితం లేదు. డ్రైనేజీ నీరుతో కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, వాహనాదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యూకాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.

 

 

Overflowing drainage water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పొంగి పొర్లుతున్న డ్రైనేజి నీరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: