బిఎస్‌ఎన్‌ఎల్‌లో 77,000 విఆర్‌ఎస్ దరఖాస్తులు

BSNL

 

జనవరి 31 నాటికి పదవీ విరమణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగం లిమిటెడ్)లో 77 వేల మంది ఉద్యోగులు విఆర్‌ఎస్(స్వచ్ఛంద పదవీవిరమణ పథకం) కోసం దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీ మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరూ 2020 జనవరి 31న వారివారి స్థానాల నుండి పదవీ విరమణ చేస్తారు. ఈ పథకం కింద ఉద్యోగులు డిసెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ శాశ్వత ఉద్యోగులందరూ, మరొక విభాగానికి డిప్యుటేషన్‌లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. 50 సంవత్సరాలు పూర్తి చేసిన వారు విఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పికె పూర్వర్ మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం, బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఉత్తమ విఆర్‌ఎస్ సౌకర్యం అని, దీనిని ఉద్యోగులు సానుకూలంగా చూడాలని అన్నారు. గతేడాది బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్‌లకు కేంద్ర ప్రభుత్వం 69 వేల కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీ ఇచ్చింది. ఎంటిఎన్‌ఎల్ కూడా తన ఉద్యోగుల కోసం విఆర్‌ఎస్ పథకాన్నిప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ -2017 ప్రకారం, సంస్థ రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరూ ఇతర సంస్థలకు డిప్యుటేషన్ లేదా బిఎస్‌ఎన్‌ఎల్ వెలుపల డిప్యుటేషన్ ప్రాతిపదికన ఉన్నవారు, వారి వయస్సు 50ఏళ్లు పైన ఉన్నవారు విఆర్‌ఎస్ పథకానికి అర్హులవుతారు.

Over 77,000 employees have opted for BSNL VRS

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిఎస్‌ఎన్‌ఎల్‌లో 77,000 విఆర్‌ఎస్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.