మే 23న ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

Oppo K3 Phone to be Launch on May 23

 

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ కె3 ని మే 23వ తేదీన భారత్ మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. స్మార్ట్‌ఫోన్‌లో 6.26 (16.51 సిఎం) ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 6 జిబి ర్యామ్‌, 128 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ని కలిగి ఉన్న ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఒప్పో కె3 ఫీచర్లు… 

6.26 (16.51 సిఎం) ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 6 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0, డ్యుయ‌ల్ సిమ్‌, యూఎస్‌బీ టైప్ సి, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా, ఇన్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 3700 ఎంఎహెచ్ బ్యాట‌రీ, వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.

Oppo K3 Phone to be Launch on May 23

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మే 23న ఒప్పో కె3 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.