ముస్కాన్.. సక్సెస్

  రంగారెడ్డి : బాలకార్మిక వ్యవస్థను పారద్రోలడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఆచరణలో మంచి ఫలితాలిస్తుంది. బడికి పోయి చదువుకోవలసిన బాల్యం హోటల్లో, పరిశ్రమల్లో ఇళ్లల్లో బందీలుగా మారడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థలను నిర్మూలించడంతో పాటు బాలలను పనిలో పెట్టుకున్న వారిపై సైతం కఠినమైన కేసులను నమోదు చేస్తుంది. బడి మానిన పిల్లలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగర శివారులో పరిశ్రమలలో పనిచేస్తున్న బాలకార్మికులను సైతం గుర్తించి వారికి రెస్కూ […] The post ముస్కాన్.. సక్సెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి : బాలకార్మిక వ్యవస్థను పారద్రోలడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఆచరణలో మంచి ఫలితాలిస్తుంది. బడికి పోయి చదువుకోవలసిన బాల్యం హోటల్లో, పరిశ్రమల్లో ఇళ్లల్లో బందీలుగా మారడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థలను నిర్మూలించడంతో పాటు బాలలను పనిలో పెట్టుకున్న వారిపై సైతం కఠినమైన కేసులను నమోదు చేస్తుంది. బడి మానిన పిల్లలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగర శివారులో పరిశ్రమలలో పనిచేస్తున్న బాలకార్మికులను సైతం గుర్తించి వారికి రెస్కూ చేస్తున్నారు. పోలీసు శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ , డిసిపిఒ చైల్డ్ వెల్ఫెర్ కమిటీ, 1098 చైల్డ్‌లైన్ సర్వీస్ వారు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నారు.

ప్రతి సంవత్సరం జూలై మాసంలో ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహిస్తూ పట్టుబడిన బాలలకు పునరావసంతో పాటు వసతి గృహాలలో జాయిన్ చేసి విద్యాభ్యాసం చేయిస్తున్నారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 310 మంది బాలలను రక్షించారు. 310లో 273 బాలురు, 37 మంది బాలికలున్నారు. 260 మంది బాలకార్మికులు, 27 రోడ్లపై భిక్షగాళ్లుగా మారిన పిల్లలు, 23 వీది బాలలున్నారు. బాలకార్మికులలలో అధిక శాతం బాలలు బీహర్ నుంచి వచిచ నగర శివారులలో గాజుల పరిశ్రమలలో పనిచేస్తున్న వారు ఉన్నారు.

పునరావసం కల్పిస్తాం: ్ల సంక్షేమ అధికారి మోతి
ఆపరేషన్ ముస్కాన్‌లో 310 మంది పిలల్లను రెస్కూ చేయడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి బడులలో చేర్పించామని జిల్లా మహిళ, శిశు వికలాంగుల, సంక్షేమ అధికారి మోతి తెలిపారు. రెస్కూ చేసిన వారికి బాండేడ్ లేబర్ రిలీజ్ సర్టీఫికేట్‌లను అందచేశామని వారికి పునరావసం సైతం కల్పిస్తామని ఆమె అన్నారు. బీహర్‌తో పాటు ఇతర రాష్ట్రాల బాలలను రెస్కూ చేసి వారి కుటుంబికులకు సమాచారం అందచేసి వారిని బడులకు పంపిస్తున్నామన్నారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఎక్కడైన బాలకార్మికులు పనిచేస్తే తమకు సమాచారం అందచేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరు తమకు సహకరించాలన్నారు.

Operation Muskan for abolish child labor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముస్కాన్.. సక్సెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: