మధుమేహులకు మంచి ఆహారం

Onions

 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలతోపాటు ఉల్లికాడలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఉల్లికాడలను (స్ప్రింగ్ ఆనియన్) సలాడ్స్, సూప్‌లో అలంకరణ కోసం, రుచికోసం వాడుతారు. లేత, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే వీటిలో పోషకగుణాలు ఎక్కువ. వీటిని తింటే ఫైబర్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఉల్లికాడలతో మరెన్నో ప్రయోజనాలున్నాయి.

* వీటిలో కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి డైట్.
* వీటిలోని అల్లిసిన్ అనే రసాయనం చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.
* వీటిలో ఫైబర్, ఎ, బి, సి విటమిన్లు, ఫోలేట్‌తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి.
* ఉల్లికాడల్లోని ఎ, సి విటమిన్లు రోగ
నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయి.
* వీటిని సలాడ్స్, సూప్‌లోనే కాకుండా కూర వండినా రుచిగా ఉంటుంది. ఇవి శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడమే కాదు జీవక్రియల్ని నియంత్రిస్తాయి కూడా.

* ఇందులోని సల్ఫర్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తుంది.
* వీటిలో లభించే అలైల్ స్ఫడ్ ఫ్రీరాడికల్స్ బయటకు పంపుతుంది. కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల విడుదలను నిలిపివేస్తుంది.
* ఉల్లికాడల్లోని కె, సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గణాలు ఈ కాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.
* ఉల్లికాడల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే కెరొటినాయిడ్స్, ఎ విటమిన్ అధికంగా ఉంటాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Onions that improve Digestive System

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మధుమేహులకు మంచి ఆహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.