పైనాన్స్ కంపెనీలో నకిలీ బంగారం తాకట్టు.. వ్యక్తి అరెస్టు

fake gold

 

హైదరాబాద్: పైనాన్స్ కంపెనీలో ఓ వ్యక్తి నకిలీ బంగారం తాకట్టు పెట్టి 3.40 లక్షలకు పైగా నగదు తీసుకుకున్న నింధితుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. డిఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పాత బస్తికి చెందిన రవికాంత్ సోను అనే వ్యక్తి ఐఐఎఫ్ పైనాన్స్ కంపెనీలో 17 తులాల నకలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 3.40 లక్షల రుణాన్ని నలుగు దశాల్లో తీసుకున్నాడు. ఇన్ స్టాల్ మెంట్స్ కట్టకపోవడంతో కంపెనీ వారికి అనుమానం వచ్చి బంగారాన్ని పరిశీలించి చూడగా అది నకిలీదని తెలింది. దీంతో కంపెనీ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెబైల్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

One person arrested in fake gold mortgage case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పైనాన్స్ కంపెనీలో నకిలీ బంగారం తాకట్టు.. వ్యక్తి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.