ద్విచక్రవాహనం-కారు ఢీ: ఒకరి మృతి

ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం – కారు ఢీ ఒకరి మృతి

Car accident

 

మనతెలంగాణ/ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారు టివిఎస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడడంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. మృతుడు డిచ్‌పల్లి గ్రామానికి చెందిన గంగారాంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు పనులు మరమ్మతులు జరుగుతుండడంతో ఒకే దారిగుండా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

One Member Dead in Car collided Bike in Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్విచక్రవాహనం-కారు ఢీ: ఒకరి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.