బైక్ ను ఢీకొట్టిన బొలెరో వాహనం

బొలెరో వాహనం భైక్ ఎదురెదురుగా ఢీ ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు మనతెలంగాణ/రామాయంపేట: బొలెరో వాహనం భైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో మెదక్-రామాయంపేట రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం… మెదక్ నుంచి రామాయంపేట వైపునకు భైక్‌పై ఎర్రొల్ల అనిల్(21) దిలీప్, నిఖిల్‌లు వస్తుండగా లక్ష్మాపూర్ శివారులోకి వీరు రాగా ఎదురుగా వస్తున్న బొలెరో […]

బొలెరో వాహనం భైక్ ఎదురెదురుగా ఢీ
ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

మనతెలంగాణ/రామాయంపేట: బొలెరో వాహనం భైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో మెదక్-రామాయంపేట రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం… మెదక్ నుంచి రామాయంపేట వైపునకు భైక్‌పై ఎర్రొల్ల అనిల్(21) దిలీప్, నిఖిల్‌లు వస్తుండగా లక్ష్మాపూర్ శివారులోకి వీరు రాగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం భైక్‌ను ఢీకొంది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.  మృతుడు ఝరాసంఘం మండల ఈదులపల్లి వాసిగా పోలీసులు గుర్తంచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana news
One Member Dead in Bolero Collided to Bike in Medak

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: