అదిలాబాద్ లో నాటు బాంబు పేలి వ్యక్తి మృతి

  ఆదిలాబాద్‌:నాటు బాంబు పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జిల్లాలోని ఉట్నూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్ర, యావత్మాల్‌ జిల్లా అర్లీ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు తీసుకొని బైక్ పై  ఉట్నూర్‌ మండలం గాదిగూడకు వెళ్తుండగా బాంబులు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. బాంబు పేలుడు తీవ్రతకు మృతి చెందిన వ్యక్తి శరీరభాగాలు చెల్లాచెదరుగా రోడ్డుమీద పడిపోయాయి. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే […] The post అదిలాబాద్ లో నాటు బాంబు పేలి వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్‌:నాటు బాంబు పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జిల్లాలోని ఉట్నూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్ర, యావత్మాల్‌ జిల్లా అర్లీ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు తీసుకొని బైక్ పై  ఉట్నూర్‌ మండలం గాదిగూడకు వెళ్తుండగా బాంబులు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. బాంబు పేలుడు తీవ్రతకు మృతి చెందిన వ్యక్తి శరీరభాగాలు చెల్లాచెదరుగా రోడ్డుమీద పడిపోయాయి. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి.. పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

One killed after bomb exploded in Adilabad

The post అదిలాబాద్ లో నాటు బాంబు పేలి వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: