రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Road Accident

హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కౌకుర్-యాప్రాల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. అతివేగం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

One Death in Road Accident At Secunderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.