టోక్యో ఒలింపిక్స్‌ 2020 వాయిదా..

  ఎథెన్స్: టోక్యో ఒలింపిక్స్‌ 2020ను వాయిదా వేయాల‌ని నిర్ణయించుకున్నట్లు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడు డిక్ పౌండ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలైలో జ‌పాన్‌ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడ‌ల‌ు జ‌ర‌గాల్సి ఉంది.అయితే,  మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాదిపాటు వాయిదా వేయాలని అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ క‌మిటీ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ క్రీడ‌ల‌ను తిరిగి ఎప్పడు నిర్వహించాలనే దానిని ఇంకా ఏ నిర్ణయం […] The post టోక్యో ఒలింపిక్స్‌ 2020 వాయిదా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎథెన్స్: టోక్యో ఒలింపిక్స్‌ 2020ను వాయిదా వేయాల‌ని నిర్ణయించుకున్నట్లు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడు డిక్ పౌండ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలైలో జ‌పాన్‌ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడ‌ల‌ు జ‌ర‌గాల్సి ఉంది.అయితే,  మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను ఏడాదిపాటు వాయిదా వేయాలని అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ క‌మిటీ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ క్రీడ‌ల‌ను తిరిగి ఎప్పడు నిర్వహించాలనే దానిని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, బహుశా 2021లో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Olympics will be postponed until 2021: IOC Member

The post టోక్యో ఒలింపిక్స్‌ 2020 వాయిదా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.