ఉబర్, ఓలాలో షేరింగ్ బంద్

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఉబర్, ఓలాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ ‘ పూల్ రైడ్’, లేదా ‘పూల్ సర్వీస్’ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇకపై ఉబర్, లేదా ఓలా టాక్సీల్లో ఒకరు లేదా, ఒకే కుటుంబానికి చెందిన వారు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా ‘ […] The post ఉబర్, ఓలాలో షేరింగ్ బంద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఉబర్, ఓలాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ ‘ పూల్ రైడ్’, లేదా ‘పూల్ సర్వీస్’ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇకపై ఉబర్, లేదా ఓలా టాక్సీల్లో ఒకరు లేదా, ఒకే కుటుంబానికి చెందిన వారు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా కరోనా కారణంగా ‘ పూల్ సర్వీస్’కు డిమాండ్ బాగా తగ్గిపోయినట్లు ఆ సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ‘ పూల్ రైడ్’ సర్వీస్‌ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపాయి.అలాగే క్యాబ్‌లలో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అత్యవసరమైతే తప్ప జనం బైటికి రావడం లేదని, దీనివల్ల క్యాబ్‌లకు డిమాండ్ బాగా తగ్గిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Ola, Uber suspend ride-sharing option across India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉబర్, ఓలాలో షేరింగ్ బంద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.