ఓలా 1400 మంది ఉద్యోగులపై వేటు

  కరోనా వైరస్‌తో ఆదాయం క్షీణించింది: ఓలా సిఇఒ న్యూఢిల్లీ: దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపింది. దాదాపు 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా సిబ్బందిలో 35 శాతం (1400) మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల రెండు నెలల్లో ఓలా రెవెన్యూ 95 శాతం క్షీణించిందని […] The post ఓలా 1400 మంది ఉద్యోగులపై వేటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా వైరస్‌తో ఆదాయం క్షీణించింది: ఓలా సిఇఒ

న్యూఢిల్లీ: దేశీయ క్యాబ్ సేవల సంస్థ ఓలాపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపింది. దాదాపు 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా సిబ్బందిలో 35 శాతం (1400) మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల రెండు నెలల్లో ఓలా రెవెన్యూ 95 శాతం క్షీణించిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు కంపెనీ బ్లాగ్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఓలా క్యాబ్స్‌కు సాఫ్ట్‌బ్యాంక్ ఫండ్స్ అందిస్తోంది.

సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన ఇతర స్టార్టప్ కంపెనీలు వివర్క్, రెస్టారెంట్ అగ్రిగేటర్ జొమాటో, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలు కూడా ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదని అగర్వాల్ అన్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఈ వారం ముగింపు లోగా పూర్తి చేయనున్నామని ఓలా సిఇఒ తెలిపారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఓలా 1400 మంది ఉద్యోగులపై వేటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: