చౌక చమురు కొనేద్దాం

500 మిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చు తగ్గిన చమురు ధరలతో వ్యూహాత్మక నిల్వలు నింపాలి ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: చమురు ధరలు చౌకగా మారిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తగ్గిన ముడి చమురు ధరలను కొనుగోలు చేయడం ద్వారా వ్యూహాత్మక నిల్వలను నింపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 500 మిలియన్ డాలర్లు ఆదా చేసుకోవచ్చని సర్కారు ఆలోచనగా ఉంది. ఈమేరకు సంబంధిత అధికారులు మీడియాతో అన్నట్టు సమాచారం. చౌకైన […] The post చౌక చమురు కొనేద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

500 మిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చు
తగ్గిన చమురు ధరలతో వ్యూహాత్మక నిల్వలు నింపాలి
ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ: చమురు ధరలు చౌకగా మారిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తగ్గిన ముడి చమురు ధరలను కొనుగోలు చేయడం ద్వారా వ్యూహాత్మక నిల్వలను నింపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 500 మిలియన్ డాలర్లు ఆదా చేసుకోవచ్చని సర్కారు ఆలోచనగా ఉంది. ఈమేరకు సంబంధిత అధికారులు మీడియాతో అన్నట్టు సమాచారం. చౌకైన చమురుతో ఈ వ్యూహాత్మక నిల్వలను ఏర్పరచుకోవడం ద్వారా తిరిగి లోటును పూడ్చుకోవాలని, దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల అవసరాలను తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంద ని అంటున్నారు.

వ్యూహాత్మక నిల్వలను పూరించడానికి రూ.5,000 కోట్ల (670 మిలియన్ డాలర్లు) విలువైన చమురు కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 30 డాలర్లు ఉంది. ఒక బ్యారె ల్ 159 లీటర్లు. ఈ ఒప్పందం డెలివరీ ఏప్రిల్-మేలో ఉంటుంది. ఈ సరఫరా మూడు వ్యూహాత్మక పెట్రోలి యం నిల్వలను నింపుతుంది. వీటి నిల్వల సామర్థ్యం 53.3 లక్షల టన్నులు. వీటిని ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్‌పిఆర్‌ఎల్) నిర్మించింది.

మొదట అరాంకో, అడ్నాక్‌లను కోరతారు..

ప్రణాళిక ప్రకారం, వ్యూహాత్మక నిల్వలను నింపమని అరామ్‌కో, అడ్నాక్‌లను మొదట కోరనున్నట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ చమురు నిల్వ తరువాత వాణి జ్యం కోసం ఉపయోగించవచ్చు. ఈ సమయంలో నిల్వల కు చమురు ఇచ్చేందుకు కంపెనీ నిరాకరిస్తే ఐఎస్‌పిఆర్‌ఎల్ ప్రభుత్వం నుండి అవసరమైన మొత్తాన్ని పొందిన తర్వాత చమురును కొనుగోలు చేస్తుంది. ఇవే కాకుండా ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కంపెనీ, బిపిసిఎల్ కూడా నిల్వలను పూరించడానికి వారి తరపున కాంట్రాక్టులు జారీ చేయమని కోరవచ్చు.

50-60 మిలియన్ డాలర్లు ఆదా

ప్రస్తుత వ్యూహాత్మక నిల్వలు గల్ఫ్ దేశాల చమురుతో సగం నిండి ఉంటే, ప్రభుత్వం 500 మిలియన్ డాలర్లు ఆదా చేయగలదని భావిస్తున్నారు. ప్రస్తుత చౌక ధరల ప్రయోజనాన్ని ప్రభుత్వం పొందడమే కాదు, గల్ఫ్ చమురు ఉత్పత్తిదారులు చమురుపై మంచి తగ్గింపు ఆఫర్లను కూడా ఇచ్చారు.

9.5 రోజుల అవసరాన్ని తీరుస్తుంది

53.3 లక్షల టన్నుల వ్యూహాత్మక నిల్వలు దాదాపు సగం నిండి ఉన్నాయి. ఇది పూర్తిగా నిండి ఉంటే ఈ చమురుతో భారతదేశం 9.5 రోజుల చమురు అవసరాలను తీర్చగలదు. ఈ మూడు స్టోర్లు విశాఖపట్నం, మంగుళూరు, పాడూర్‌లలో ఉన్నాయి. ఇవి కాకుండా 6.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఇతర నిల్వలను పాడూర్, చండిఖోల్ వద్ద కూడా నిర్మిస్తున్నారు. బికానెర్, రాజ్‌కోట్‌లోని మరో రెండు స్టోర్ల పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత అవి కూడా నిండి ఉంటే ఇది దేశీయ అవసరాన్ని ఒక నెలకు పైగా నెరవేరుస్తుంది. ఇది కాకుండా 90 నుంచి -100 రోజుల దేశీయ అవసరాన్ని ఎప్పుడైనా తీర్చగలిగేలా ఇతర ప్రదేశాలలో కూడా నిల్వలను సృష్టించడానికి ప్రయత్నించాలని చమురు మంత్రిత్వ శాఖ ఐఎస్‌పిఆర్‌ఎల్‌ను కోరింది. ఈ రోజుల్లో ప్రభుత్వం చౌక చమురుతో స్టాక్ నింపడం ద్వారా మాత్రమే ఆదా చేస్తుంది. కానీ తరువాత దీనిని వాణిజ్యపరంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సగం నిండి ఉన్నాయి. రూ .5 వేల కోట్ల బడ్జెట్‌తో మిగిలిన 53.3 లక్షల టన్నుల బేస్ కూడా నింపవచ్చు.

ఇప్పటికే అనేక ఒప్పందాలు జరిగాయి

2.5 మిలియన్ టన్నుల పాదుర్ నిల్వలను సగం అద్దెకు ఇవ్వడానికి ఐఎస్‌పిఆర్‌ఎల్ అడ్నాక్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పాడూర్ నిల్వల సామర్థ్యంలో నాలుగింట ఒక వంతు లీజుకు ఇవ్వడానికి గత ఏడాది సౌదీ అరామ్‌కోతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎస్‌పిఆర్‌ఎల్ ఇప్పటికే మంగుళూరులోని 1.5 మిలియన్ టన్నుల నిల్వలను సగం అడ్నాక్‌కు లీజుకు ఇచ్చింది. ఇది విశాఖపట్నం 10.3 లక్షల టన్నుల స్టాక్‌ను ఇరాక్ బాస్రా ఆయిల్‌తో నింపింది.

చమురు ధర 57% పడిపోయింది

మార్చిలో ఇప్పటివరకు ముడి చమురు ధరలు దాదాపు 40 శాతం తగ్గాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ మధ్యాహ్నం ట్రేడ్‌లో 6 శాతం పెరిగి 29.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కేసులు ప్రారంభమైనప్పటి నుండి చమురు ధర 57 శాతం తగ్గింది. బ్రెంట్ క్రూడ్ రేటు జనవరి 6న బ్యారెల్ 68.91 వద్ద ఉంది. మార్చి 18 శుక్రవారం ఇది బ్యారెల్‌కు 24.88కు పడిపోయింది. ఈ స్థాయి నుండి కేవలం రెండు రోజుల్లో ముడి సుమారు 20 శాతం ఖరీదైనది.

కరోనా వైరస్, ధరల యుద్ధమే కారణం

మొదట చైనాలో, ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చమురు పరిశ్రమ నిలిచిపోయింది. ఈ కారణంగా ముడి డిమాండ్ తగ్గి, ధర బాగా పడిపోయి 68 నుండి 50 డాలర్లకు దిగివచ్చింది. దీని తరువాత ముడి ధరను పెంచడానికి ఒపెక్, రష్యా, పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థలతో సహా మరికొన్ని దేశాలలో ఉత్పత్తిని తగ్గించే చర్చ జరిగింది. ఈ చర్చలో రష్యా ఉత్పత్తిని తగ్గించడానికి నిరాకరించింది. దీని తరువాత సౌదీ అరేబియా తన తరపున ఉత్పత్తిని పెంచుతామని ప్రకటించింది. ముడి ధరను కూడా తగ్గించింది. ఇది ముడిచమురు ధరకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో క్రూడ్ 30 కంటే తక్కువకు పడిపోయింది.

Oil Prices Droped in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చౌక చమురు కొనేద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: