సిసిఎల్‌ఎ ఆదేశాలు బేఖాతర్!

  విఆర్‌ఏల క్యాడర్‌స్ట్రెంత్‌పై సమాచారమివ్వని అధికారులు స్పందించిన ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలు పదోన్నతుల నేపథ్యంలో ఆరోపణలు 2011 నుంచి వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ శాఖ హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్‌ఏ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిసిఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాలకు చాలా జిల్లాలు స్పందించడం లేదు. ఇప్పటికే పలుమార్లు విఆర్‌ఏల వివరాలను పంపించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినా వారి నుంచి స్పందన రావడం లేదని సిసిఎల్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు. […] The post సిసిఎల్‌ఎ ఆదేశాలు బేఖాతర్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విఆర్‌ఏల క్యాడర్‌స్ట్రెంత్‌పై సమాచారమివ్వని అధికారులు
స్పందించిన ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలు
పదోన్నతుల నేపథ్యంలో ఆరోపణలు
2011 నుంచి వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ శాఖ

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్‌ఏ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిసిఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాలకు చాలా జిల్లాలు స్పందించడం లేదు. ఇప్పటికే పలుమార్లు విఆర్‌ఏల వివరాలను పంపించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినా వారి నుంచి స్పందన రావడం లేదని సిసిఎల్‌ఏ అధికారులు పేర్కొంటున్నారు. 2011 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు విఆర్‌ఏల క్యాడర్ స్ట్రెంత్ గురించి పూర్తి వివరాలను అడుగుతున్నామని అప్పటినుంచి జిల్లాల అధికారులు స్పందించడం లేదని సిసిఎల్‌ఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సిసిఎల్‌ఏ అడిగిన వివరాలకు సంబంధించి ఆదిలాబాద్, హైదరాబాద్, ఈ రెండు జిల్లాలు తప్పా మిగతా జిల్లాలు స్పందించలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయమై సిసిఎల్‌ఏ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది.

తప్పుడు పత్రాలను సృష్టించి ఉద్యోగంలో చేరి
2012 కన్నా విఆర్‌ఏలను (గ్రామ సేవకులుగా, కావాలికారు, మన్కూరిలుగా) పిలిచేవారు. 2012 కన్నా ముందే విఆర్‌ఏల రిక్రూట్‌మెంట్‌ను తహసీల్దార్లు చూసేవారు. ఈ నేపథ్యంలో 2012 సంవత్సరం కన్నా ముందు విఆర్‌ఏల రిక్రూట్‌మెంట్‌లపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తహసీల్దార్లు తమ ఇష్టానుసారంగా విఆర్‌ఏలను నియమించుకున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తాతలు చేసే ఈ ఉద్యోగాన్ని వారి మనువలకు సైతం ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2012లో విఆర్‌ఏలను రాతపరీక్ష విధానం ద్వారా రిక్రూట్‌మెంట్ చేసుకోవాలని నిర్ణయించింది.

2012 సంవత్సరంలో రాతపరీక్ష ద్వారా
2012 సంవత్సరంలో రాతపరీక్ష ద్వారా 2,500 మందిని, 2014 సంవత్సరంలో 1600 మందిని ప్రభుత్వం విఆర్‌ఏలుగా ఉద్యోగంలోకి ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందు దొడ్డిదారిన విఆర్‌ఏ ఉద్యోగంలో చాలామంది చేరారని, వారంతా ప్రస్తుతం తప్పుడు సర్టిఫికెట్లను పెట్టి డిఫ్యూటీ తహసీలార్లు, తహసీలార్లుగా ప్రమోషన్లు పొందారని డైరెక్టు రిక్రూట్‌మెంట్ విఆర్‌ఏలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే వారు పభుత్వానికి చాలా సార్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే 2015 సంవత్సరంలో కారుణ్య నియామకంతో పాటు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా విఆర్‌ఓలుగా చేరిన వారికి పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను కొన్ని జిల్లాల అధికారులు పట్టించుకోలేదని, దొడ్డిదారిని వచ్చిన వారికి సైతం పదోన్నతులు కల్పించారని, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌గా విఆర్‌ఓలుగా చేరిన వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మార్గదర్శ కాలను విడుదల చేసింది. అయినా దీనికి సంబంధించిన అక్రమ తంతూ అక్కడక్కడ కొనసాగుతూనే ఉందని అయితే చాలాచోట్ల రోస్టర్ నిబంధనలను పాటించలేదని రెవెన్యూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది విఆర్‌ఏలు పనిచేస్తుండగా, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుతం ఈ క్యాడర్‌లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నిషేధం ఉన్న సమయంలో కొన్ని జిల్లాలో విఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించారన్న ఆరోపణలు వినిపించాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో మరోసారి విఆర్‌ఏల క్యాడర్ స్ట్రెంత్‌పై పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల అధికారులను సిసిఎల్‌ఏ ఆదేశించింది.

అయినా ఇప్పటివరకు ఎవరూ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో విఆర్‌ఏ వ్యవస్థపై గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి సిసిఎల్‌ఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు దొడ్డిదారిన రిక్రూట్‌మెంట్ అయిన వారి వివరాలతో పాటు తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన వారి వివరాలను కూడా రెవెన్యూ శాఖ సేకరించే పనిలో ఉన్నట్టుగా తెలిసింది.

విఆర్‌ఓల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు
రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విఆర్‌ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు ఈశ్వర్
2012 కన్నా ముందు విఆర్‌ఓల రిక్రూట్‌మెంట్‌లో అనేక అవకతవకలు జరిగాయి. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. దొంగ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పదోన్నతులు పొందా రు. ప్రస్తుతం కొన్నిచోట్ల పదోన్నతులపై బ్యాన్ ఉన్నా పట్టించుకోవడం లేదు. దీనివలన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు చేసే వారికి నష్టం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Officers who do not comply with CCLA directives

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిసిఎల్‌ఎ ఆదేశాలు బేఖాతర్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: