కన్నెపల్లిలో 3 మోటార్లతో ఎత్తిపోత…

  గోదావరికి చేరనున్న 10 వేల క్యూసెక్కుల ప్రాణహిత ఇన్‌ఫ్లో దేవాదులలో మోటార్ల రన్‌కు సిద్ధమైన అధికారులు వరంగల్ : గోదావరి ఎత్తిపోతలకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాణహిత ఇన్‌ఫ్లో శుక్రవారం 10 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాణహిత ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి వద్ద నీటి మట్టం పెరుగుతుండటం వల్ల శుక్రవారం ఐదు గంటల వరకు మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. […] The post కన్నెపల్లిలో 3 మోటార్లతో ఎత్తిపోత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోదావరికి చేరనున్న 10 వేల క్యూసెక్కుల ప్రాణహిత ఇన్‌ఫ్లో
దేవాదులలో మోటార్ల రన్‌కు సిద్ధమైన అధికారులు

వరంగల్ : గోదావరి ఎత్తిపోతలకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాణహిత ఇన్‌ఫ్లో శుక్రవారం 10 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాణహిత ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి వద్ద నీటి మట్టం పెరుగుతుండటం వల్ల శుక్రవారం ఐదు గంటల వరకు మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. సాయం త్రం ఐదు తరువాత రెండు మోటార్లను నిలిపివేసిన అధికారులు ఒక్క మోటారుతో నీటిని ఎత్తిపోశారు.

పై నుంచి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేస్తున్న సీడబ్లూసీ, ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతు గోదావరి వరద పెరిగితే కన్నెపల్లితోపాటు దేవాదుల ప్రాజెక్టులోని మోటార్లను కూడా రన్ చేయడానికి ఏర్పాటుచేశారు. కన్నెపల్లి వద్ద ఉన్న తొమ్మిది మోటార్లు రన్ చేయడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. శుక్రవారం మూడు మోటార్లు రన్ చేయడం వల్ల ఎత్తిపోసిన నీరు సుందిళ్లకు వెళ్లే ప్రధాన కాలువ నిండుగా ప్రవహించింది. దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడానికి అధికారులు మోటార్ల పనితీరు, షట్టర్ల బిగింపు లాంటి ఏర్పాట్లను శుక్రవారం పూర్తి చేశారు. వరద ఉధృతి ఎప్పుడు పెరిగినా ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయడానికి అధికారులు ప్రత్యేకంగా విధుల్ని నిర్వహిస్తున్నారు.

Officers prepared to run motors in Devadula

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కన్నెపల్లిలో 3 మోటార్లతో ఎత్తిపోత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: