మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు

Narendra Modi

 

పోలీసుల అదుపులో ఇద్దరు

ముజఫర్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు బుధవారం చెప్పారు. శివం మెఘాలీ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై పోలీసులు బిజేందర్ సయినీ, ప్రిన్స్ అశోక్ ఆచార్యలను సమాచార సాంకేతిక చట్టం (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్) కింద మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్ కపర్వన్ చెప్పారు. ప్రధానమంత్రి ఫోటోను ఉంచి, నిందితుడు ఆయనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యల పోస్ట్ చేశాడని మెఘాలీ ఫిర్యాదు చేశారని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు.

Offensive comments on Narendra Modi in Social Media

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.