ఒడిశాలో 1000 పడకల కరోనా ఆస్పత్రి

  దేశంలోనే తొలి సారిగా రెండు భారీ వైద్యశాలల ఏర్పాటు భువనేశ్వర్‌లో పక్షం రోజుల్లోనే సిద్ధం త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు భువనేశ్వర్: భారత దేశంలో కరోనా వైరస్ (కోవిడ్19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడంద్వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఐసొలేషన్ వార్డులు, చికిత్సకు అవసరమైన సదుపాయాలు లేక అటు రోగులు, ఇటు వైద్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. […] The post ఒడిశాలో 1000 పడకల కరోనా ఆస్పత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలోనే తొలి సారిగా రెండు భారీ వైద్యశాలల ఏర్పాటు
భువనేశ్వర్‌లో పక్షం రోజుల్లోనే సిద్ధం
త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు

భువనేశ్వర్: భారత దేశంలో కరోనా వైరస్ (కోవిడ్19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడంద్వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఐసొలేషన్ వార్డులు, చికిత్సకు అవసరమైన సదుపాయాలు లేక అటు రోగులు, ఇటు వైద్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. కరోనా( కోవిడ్19) వైద్యచికిత్సల కోసం వెయ్యి పడకలు గల రెండు ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయించిం ది. భువనేశ్వర్‌లో ఈ ఏర్పాటు చేయబోయే ఈ రెండు ఆస్పత్రులు 15 రోజుల్లోనే పూర్తయి పని చేయడం ప్రారంభిస్తాయి. దేశంలోనే కరోనా చికిత్స కోసం ఇంత పెద్ద ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రం ఒడిశాయే కావ డం గమనార్హం.

దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌యుఎం, కిమ్స్ మెడికల్ కాలేజిలతో రెండు త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఒడిశా మైనింగ్ కార్పొ రేషన్, మహానది కోల్‌ఫీల్స్ లిమిటెడ్( ఎంసిఎల్)లు ఈ ప్రాజెక్టుకు అవసరమైన సిఎంఆర్ నిధులను సమకూరుస్తాయి. ఈ రెండు ఆస్పత్రులు కూడా పక్షం రోజుల్లోపలే పని చేయడం ప్రారంభిస్తాయని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 450 పడకల ఆస్పత్రిని ఏర్పా టు చేయడానికి సంబంధించిన తొలి ఒప్పందంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నికుంజ బిహారీ ధాల్, ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ వినీల్ కృష్ణ, కిమ్స్ మేనేజిమెంట్ సంతకాలు చేశాయి. ఐసియు సదుపాయాలతో పాటుగా మరో 500 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సంబంధించిన రెండో ఒప్పందంపై ఆరోగ్య కార్యదర్శి, ఎంసిఎల్‌తరఫున ఎస్‌ఎస్ పండా, ఎస్‌యుఎంలు సంతకాలు చేశారు.

అసోంలో 700 పడకల క్వారంటైన్ సెంటర్
అసోంలో కూడా రాష్ట్రప్రభుత్వం కరోనా రోగులను క్వారంటైన్‌లో ఉంచడం కోసం 700 పడకలతో అతి పెద్ద తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. ఈ ఆస్పత్రి వారం రోజుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఒక ట్వీట్‌లో తెలియజేశారు. ఆయన గురువారం ఉదయం గౌహతిలోని సరుసోజై స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు కానున్న ఈ క్వారంటైన్ సెంటర్ పనులను పరిశీలించారు. దాదాపు 200 మంది డాక్టర్లు ఉండడానికి వీలుగా దీనికి దగ్గర్లోనే ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను రాష్ట్రప్రభుత్వం అద్దెకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. గౌహతికి సమీపంలోని సోనాపూర్‌లో మరో 200 పడకల ఆస్పత్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు కామరూప్ జిల్లా డిప్యూటీ కమిషనర్ బిశ్వజిత్ పెగు చెప్పారు.

Odisha announces Corona Hospital , with 1000 beds

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒడిశాలో 1000 పడకల కరోనా ఆస్పత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: