వాళ్లు నన్ను చంపాలని చూశారు: సుమన్

మంచిర్యాల: ఓదెలు అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని బాల్క సుమన్ తెలిపారు. ఓదెలు అనుచరులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని, కార్యకర్తలు, పోలీసులే తనని కాపాడారని సుమన్ చెప్పారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా చెన్నూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  ఎంపి బాల్క సుమన్ ప్రచారం చేస్తుండగా ఇందారంలో నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకున్నాడు. నల్లాల ఓదెలు కాదని బాల్క సుమన్ కు చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ టిఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన విషయం […]

మంచిర్యాల: ఓదెలు అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని బాల్క సుమన్ తెలిపారు. ఓదెలు అనుచరులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని, కార్యకర్తలు, పోలీసులే తనని కాపాడారని సుమన్ చెప్పారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా చెన్నూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  ఎంపి బాల్క సుమన్ ప్రచారం చేస్తుండగా ఇందారంలో నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య ఒంటికి నిప్పంటించుకున్నాడు. నల్లాల ఓదెలు కాదని బాల్క సుమన్ కు చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ టిఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన విషయం తెలిసిందే

Comments

comments

Related Stories: