ఇష్టాన్ని పెంచండి..!

  ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే చిన్నతనంలో పౌష్టికాహార లోపం భవిష్యత్తులో అనారోగ్యహేతువుగా మారుతుంది. అందుకు పిల్లల ఆహారం పట్ల పెద్దలు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు మాకు అది వద్దు ఇది వద్దు అంటూ తిండి విషయంలో మారాం చేస్తుంటారు. తల్లి ఈ విషయంలో కబుర్లు చెబుతూ, చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం మనం చూస్తుంటాం. కాని నేటి యాంత్రిక యుగంలో పిల్లల సంరక్షణలో తల్లి శ్రద్ధ చూపలేక పోతోంది. […]

 

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే చిన్నతనంలో పౌష్టికాహార లోపం భవిష్యత్తులో అనారోగ్యహేతువుగా మారుతుంది. అందుకు పిల్లల ఆహారం పట్ల పెద్దలు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు మాకు అది వద్దు ఇది వద్దు అంటూ తిండి విషయంలో మారాం చేస్తుంటారు. తల్లి ఈ విషయంలో కబుర్లు చెబుతూ, చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం మనం చూస్తుంటాం. కాని నేటి యాంత్రిక యుగంలో పిల్లల సంరక్షణలో తల్లి శ్రద్ధ చూపలేక పోతోంది. సమయం కేటాయించక లేకపోతోంది ఉద్యోగం చేసే తల్లి. ఫలితంగా పిల్లలు కొన్నింటికే పరిమితం అవుతూ సమతుల్య ఆహారాన్ని కోల్పోతున్నారు.

పిల్లలకు ఇష్టమైన రీతిలో కొత్తగా వండుతూ వారికి కూరగాయలు, పండ్లు వంటివి అలవాటు చెయ్యాలి. సాధరణంగా పిల్లలు 34 ఏళ్లు వయ స్సులో సొంతంగా తినడం ప్రారంభిస్తారు. అప్పుడే తల్లీ పిల్లల మధ్య ఘర్షణ వాతావరణం మొదలవుతుంది. తమకు నచ్చిందే తినాలంటారు పిల్లలు. లేదా బలవంతంగా తినిపిస్తారు దాంతో పిల్లలకు ఆ ఆహారం పట్ల విముఖత ఏర్పడుతుంది. కొన్నింటికే పరిమితం అవుతారు. పాత వాటిని ముట్టరు. చిరుతిళ్లకు అలవాటు పడతారు. విభిన్న రుచుల కోసం ఫాస్ట్ ఫుడ్ పట్ల ఆకర్షితులవుతారు.

పిల్లల చేతుల్లో చిప్స్ పాకెట్స్ ఉండడం చూస్తు ఉంటాం .నేడు ప్రతి దుకాణం లోనూ చిప్స్, ఇతర నూనె తయారీ వస్తువులు వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే నేటి జీవన శైలిలో సెలవు దినాల్లో రెస్టారెంట్లు, హోటల్స్‌కు వెళ్లడం సాధారణంగా మారింది. అక్కడ అంతా ఫాస్ట్ ఫుడ్ తరహాలో ఆహార పదార్థాలు ఉంటాయి. అవి తిన్న పిల్లలు ఇంట్లో చేసేవి తినడానికి ఇష్టపడరు. అలాగే స్కూలుకు వెళ్లే పిల్లలకు లంచ్‌బాక్స్ ఇస్తే వారు సాయంత్రం దాన్ని ముట్టుకోకుండా ఇంటికి తీసుకువస్తారు. తల్లిదండ్రులు పిల్లలు ఈ రోజు ఏమి తినలేదని ఆందోళన పడతారు. దానికి కారణం పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ అలవాటు అనడం వల్ల ఇంట్లో చేసే మామూలు ఆహారం నచ్చదు. అందువల్ల నేటి తల్లులు లంచ్‌బాక్స్ రోజుకో రుచిగా కొత్త వంటలు నేర్చుకొని పిల్లలను ఆకర్షించేవి చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగితే పిల్లలు పూర్ ఈటర్స్‌గా మారతారు. ఫలితంగా ఆకలి విషయం మర్చిపోతారు. ఎంత తినాలో కూడా తెలుసుకోలేరు, పౌష్టికాహారలోపం ఏర్పడుతోంది. మరో వైపు ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకునే పిల్లలు భారీ పొట్టలతో వికారంగా మారుతున్నారు. బొద్దుగా ఉన్నారు అనుకుంటారుగాని అది ఫ్యాట్ అనేది తల్లిదండ్రులు గ్రహించరు. చెంచాలతో ఆహారం తీసుకునే అలవాటు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారు. ఇది కూడా పిల్లలకు భోజనం పట్ల భయం ఏర్పడే అవకాశం ఉంది. వారు కొద్ది కొద్దిగా తిన్నా ఎక్కువసార్లు తినేలా అలవాటు చేయడం మంచిది.

ఆహారం సరిగా తీసుకొని పిల్లల విషయంలో ప్రత్యామ్నాయంగా పాలు, పళ్లు ఇవ్వడం అలవాటు చెయ్యడం మంచిది. అలాగే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఉదయం నిద్రలేవగానే నీరు తాగడం అలవాటు చెయ్యాలి. ఎక్కువగా జ్యూస్ ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి మంచిది. పండ్లు డైరెక్ట్‌గా తినకపోతే జ్యూస్ ఇవ్వచ్చు. ఫలితంగా సీజన్‌లో వచ్చే అన్ని పళ్లు తీసుకునే అలవాటు అవుతుంది. ముఖ్యంగా భోజనంలో కొత్త కొత్తగా రెసిపీలతో పిల్లలను ఆకర్షించాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలతో రైస్ చెయ్యడం వల్ల పిల్లలను ఆకర్షించవచ్చు. అలాగే ఆహార సంబంధిత పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. ఫలితంగా పోషకాల విషయాలలో అవగాహన ఏర్పడుతుంది. ఆకు కూరలు, కాయకూరలు, దుంపలు కూడా ఆహారంలో భాగమవ్వాలి. విటమిన్స్ అధికంగా ఉండే జీడిపప్పు, బాదం, కిస్‌మిస్, ఖర్జూరం వంటివి కూడా అలవాటు చెయ్యాలి. పాయసం వంటివి తరచూ చెయ్యడం వల్ల సుగంధ ద్రవ్యాలు అలవాటవుతాయి.

తల్లిదండ్రులు మార్కెట్‌కు, సూపర్ మార్కెట్‌కు వెళ్ల్లేప్పుడు పిల్లల్ని తీసుకువెళ్లాలి. వారు అక్కడి కూరగాయలు, సరుకుల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడమే కాక వారికి ఇష్టమైన వాటిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇంటి పనుల్లో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా తల్లిదండ్రుల అలవాట్లు తొందరగా నేర్చుకుంటారు. అలాగే స్నేహితులను తరుచూ పార్టీల పేరుతో ఇంటికి పిలిస్తే వారి మంచి అలవాట్లు నేర్చుకుంటారు. అయిష్టమయిన పదార్థాలను వారికి ఇష్టమైన వాటి కాంబినేషన్లతో తినేలా అలవాటు చెయ్యాలి. మాంసాహారం పట్ల మక్కువ పెరిగేలా చేసి మామూలు ఆహార పదార్థాలు తక్కువ తినే అలవాటు చేయకూడదు.. గుడ్డు, పాలను మించిన బలవర్ధకమైన ఆహారం ఏదీ లేదు. తాజా ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, పప్పు గింజల ఆహారం, ఇతర కూరగాయలు తరచూ తీసుకోవాలి. అప్పుడే సమగ్రంగా సమతుల్యత ఆహారం అవుతుంది. పిల్లల అలవాట్లు ఒక్క సారిగా మారిపోవు. నెమ్మదిగా, సహనంతో, బుజ్జగించి వారికి తినిపించడం, వాటిపట్ల అవగాహన కల్పించడం, చేస్తే తప్పక మారతారు. దానికి తల్లులకు సహనం, జాగ్రత్త అవసరం. అప్పుడే వారు ఆరోగ్యమైన పౌరులుగా మారతారు.

Nutritional deficiencies in childrens

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: