85 మందిని చంపిన నర్సుకు జీవిత ఖైదు

ఓల్డెన్‌బర్గ్: జర్మనీలో 85 మంది రోగులను చంపిన మగ నర్సుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆసుపత్రిలో తన సంరక్షణలో ఉండే రోగులను ఎంచుకుని నర్సు నియల్స్ హోగెల్ విషపు ఇంజిక్షన్లు ఇచ్చి చంపుతూ వచ్చాడు. 2000 సంవత్సరం నుంచి 2005 వరకూ సాగించిన ఈ దారుణమారణకాండతో ఈ వ్యక్తి అత్యంత భయానక సీరియల్ కిల్లర్‌గా అభియోగాలు ఎదుర్కొన్నాడు. యుద్ధానంతర జర్మనీ చరిత్రలో ఈ నర్సు రాక్షసకాండ కీలకమైన కేసుగా మారింది. న్యాయమూర్తి సెబాస్టిన్ బ్యూహ్రెమాన్ కేసు […] The post 85 మందిని చంపిన నర్సుకు జీవిత ఖైదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఓల్డెన్‌బర్గ్: జర్మనీలో 85 మంది రోగులను చంపిన మగ నర్సుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆసుపత్రిలో తన సంరక్షణలో ఉండే రోగులను ఎంచుకుని నర్సు నియల్స్ హోగెల్ విషపు ఇంజిక్షన్లు ఇచ్చి చంపుతూ వచ్చాడు. 2000 సంవత్సరం నుంచి 2005 వరకూ సాగించిన ఈ దారుణమారణకాండతో ఈ వ్యక్తి అత్యంత భయానక సీరియల్ కిల్లర్‌గా అభియోగాలు ఎదుర్కొన్నాడు. యుద్ధానంతర జర్మనీ చరిత్రలో ఈ నర్సు రాక్షసకాండ కీలకమైన కేసుగా మారింది. న్యాయమూర్తి సెబాస్టిన్ బ్యూహ్రెమాన్ కేసు విచారించి జీవిత ఖైదును విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వ్యక్తి సాగించిన దురగాతం క్షమించరానది, గర్హనీయం అని, ఈ కేసు విచారణ దశలో తమకు పలు బాధాకరమైన ప్రశ్నలనే మిగిలిన పలు కుటుంబాల దీనగాధలు తెలిసివచ్చాయని వ్యాఖ్యానించారు. 42 ఏండ్ల నర్సు ఆసుపత్రికి వచ్చే రోగులలో కొందరిని ఎంచుకుని వారిని ఇంజిక్షన్లతో మరింతగా కుంగదీసి చంపివేస్తూ వచ్చాడు. ఒకసారి ఈ దారుణానికి పాల్పడుతూ ఉండగా పట్టుకోవడంతో ఈ వరుస నేరాల గురించి వెల్లడైంది. అంతకు ముందు ఆరు హత్యలకు సంబంధించి ఈ వ్యక్తి దశాబ్దం పాటు జైలులో ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం 85 మంది రోగుల దారుణ హత్య కేసులో దోషిగా తేలిన హోగెల్ మొత్తం 200 మందికి పైగా రోగులను చంపివేసి ఉంటాడని భావిస్తున్నారు.

ఆసుపత్రిలో మృతి చెందిన మరో 130 మంది భౌతికకాయాల వెలికితీత, శవ పరీక్ష తరువాత ఈ కిల్లర్‌పై తిరిగి కేసు విచారణ జరుగుతుందని, తరువాత శిక్ష వేరే విధంగా ఉంటుందని వెల్లడైంది. తాను ఎంత మందిని చంపాననేది తనకు గుర్తు లేదని ఈ వ్యక్తి చెప్పడంతో, పలు శవాలకు పోస్టుమార్టంలు లేకుండానే ఖననం చేయడంతో న్యాయస్థానానికి ఈ వ్యక్తికి ఏ స్థాయిలో శిక్ష విధించాలనేదానిపై స్పష్టత రావడం లేదు. దీనిని తీవ్రస్థాయి నర్కిసిస్టిక్ రుగ్మత అని చెపుతారని ఈ సైకియాట్రిస్టు వెల్లడించారు.

Nurse jailed for killing 85 people

The post 85 మందిని చంపిన నర్సుకు జీవిత ఖైదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: