పీరియడ్, యాక్షన్ డ్రామా

  ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుందనే వార్త చాలా కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అభిమానుల్లో సందేహాలు ఉండగా… తారక్ పుట్టిన రోజు కానుకగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పీరియడ్ అండ్ యాక్షన్ డ్రామాగా […] The post పీరియడ్, యాక్షన్ డ్రామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుందనే వార్త చాలా కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అభిమానుల్లో సందేహాలు ఉండగా… తారక్ పుట్టిన రోజు కానుకగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పీరియడ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరక్కించనున్నాడట. ఇక ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌పై ఎన్టీఆర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడట. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తారక్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది ఉంటుందని తెలిసింది. ఇక ఈ స్టార్ హీరో ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ మూవీ నుండి బయటకి రావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ప్రశాంత్ నీల్ సైతం అక్టోబర్ తరువాత కెజిఎఫ్2 ప్రాజెక్ట్ నుండి బయటికి వస్తాడు. ఈ లోపు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి 2021లో ఎన్టీఆర్‌తో మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్నది ప్లాన్ అట.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పీరియడ్, యాక్షన్ డ్రామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: