ఎన్‌టిపిసి లాభం రూ.2,602 కోట్లు

NTPC

 

లండన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019- 20) తొలి త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి నికర లాభం రూ.2,840 కోట్లు వచ్చింది. శనివారం జూన్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో సంస్థ లాభాలు 6 శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,688 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.26,272 కోట్లకు చేరగా, గత ఏడాది ఇదే సమయంలో రూ.24,148 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఎన్‌టిపిసి మొత్తం 76.63 బిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఈ సీజన్‌లో టారిఫ్ ధర రూ.3.63గా ఉంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తి ఈ సీజన్‌లో తగ్గి 73.91శాతంగా ఉంది. దేశీయ బొగ్గు సరఫరా 43.04 మిలియన్ టన్నుల నుంచి 42.28 మిలియన్ టన్నులకు తగ్గింది.

NTPC Q1 profit flat at Rs 2,603 crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్‌టిపిసి లాభం రూ.2,602 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.