నగర శివారుల్లో నామినేషన్లకు వేళాయె..

            రంగారెడ్డి: పల్లెలలో రాజకీయ వేడి రాజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం గ్రామాలలో రాజకీయ వాతావరణం కొంత చల్లబడ్డ జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి నేటి నుంచి మొదటి విడత నామినేషన్‌ల స్వీకరణ పర్వం ప్రారంబించడానికి సన్నహాలు చేస్తున్న రాజకీయ పార్టీలలో మాత్రం అభ్యర్దులపై ఇప్పటివరకు పూర్తి స్థాయి […] The post నగర శివారుల్లో నామినేషన్లకు వేళాయె.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

 

 

 

 

రంగారెడ్డి: పల్లెలలో రాజకీయ వేడి రాజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం గ్రామాలలో రాజకీయ వాతావరణం కొంత చల్లబడ్డ జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి నేటి నుంచి మొదటి విడత నామినేషన్‌ల స్వీకరణ పర్వం ప్రారంబించడానికి సన్నహాలు చేస్తున్న రాజకీయ పార్టీలలో మాత్రం అభ్యర్దులపై ఇప్పటివరకు పూర్తి స్థాయి స్పష్టత కనిపించడం లేదు. మొదటి విడత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో నేటి నుంచి ఈ నెల 24 వరకు నామినేషన్‌లు స్వీకరణ, 25 న పరిశీలన, 26 అభ్యంతరాల స్వీకరణ, 27 అభ్యంతరాల పరిశీలన, 28 నామినేషన్‌ల ఉపసంహరణ నిర్వహించి మే 6 ఉదయం 7 నుంచి సాయంత్రం ఎడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

22,23,24 తేదిలలో మాత్రమే మొదటి విడత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో నామినేషన్‌లు స్వీకరణ జరుగనున్న ఇప్పటివరకు ఒక్క రాజకీయ పార్టీ కూడ తమ అభ్యర్దులను ప్రకటించకపోవడంతో అంతా అయోమయం కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో మొయినాబాద్, శఃకర్‌పల్లి, షాబాద్, చెవెళ్ల, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల మండలాల పరిధిలోని 96 ఎంపిటిసిలు, 7 జడ్పీటిసిలకు ఎన్నికలు నిర్వహించనుండగా 2,87,598 మంది ఓటర్లు 526 పోలింగ్ స్టేషన్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అశావాహూలలో టెన్షన్ …టెన్షన్…

నేటి నుంచి నామినేషన్‌ల పర్వం ప్రారంబం అవుతున్న తమకు టికెట్‌పై స్పష్టత లేకపోవడంతో అశావాహూలలలో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతుంది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల, ఇబ్రహింపట్నం శాసనసభ నియోజకవర్గాలలో జరగనుండటంతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, బడా నేతల ఇళ్ల చుట్టు అశావాహూలు చక్కర్లు కొడుతున్నారు. చెవెళ్ల, ఇబ్రహింపట్నం నియోజకవర్గాలలో అధికార టిఆర్‌యస్‌కు శాసనసభ్యులు కాలే యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గెలుపు గుర్రాల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన సియం కెసిఆర్ ముందు తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉండటంతో అభ్యర్దుల ఎంపికపై పెద్ద కసరత్తు కొనసాగుతుంది.

రెండు నియోజకవర్గాలలో పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరడంతో పదవుల ఎంపిక ఇబ్బందికరంగా మారింది. చెవెళ్లలో ఒక్కో పదవికి ఐదు మందికి పైగా అశావాహూలు ఉండటం ఒకరు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ద్వారా మరొకరు ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్వారా, మరొకరు మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మరొకరు మాజీ ఎమ్మెల్యే కె.యస్.రత్నం ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య నిర్ణయం ఫైనల్ కానుందని ప్రచారం జరుగుతుంది. జడ్పీటిసి పదవుల కోసం ఒక్క మండలం నేతలు మరో మండలం నుంచి పోటిచేయడానికి, ఎంపిపి పదవి కోసం ఒక్క గ్రామ నేతలు మరో గ్రామం నుంచి ఎంపిటిసిలుగా బరిలోకి దిగడానికి ఉత్సాహం చూపడం విమర్శలకు తావిస్తుంది.

అధికార టిఆర్‌యస్‌లో పదవుల కోసం నేతలు పోటిపడుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్‌లో నేతలు మాత్రం పరేషాన్‌లో ఉన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డికి గట్టుపట్టున్న చెవెళ్లలో కాంగ్రెస్ నేతలు అంతా అమే వెంట టిఆర్‌యస్‌లోకి వలసపోవడంతో జడ్పీటిసి, ఎంపిటిసిలుగా బరిలోకి దిగడానికి అభ్యర్దుల కరువయ్యారు. కాంగ్రెస్‌లో నేతలు కరువవడంతో టిఆర్‌యస్ నేతలు తమ అనుచరులను కాంగ్రెస్ తరపున రంగంలోకి దించి నామినేషన్‌ల ఉపసంహరణ రోజున వారితో నామినేషన్‌లు ఉపసంహరింపచేసి ఎకగ్రీవంగా విజయం సాధించడానికి సైతం ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారు.

శాసనసభ ఎన్నికల సమయంలో టిఆర్‌యస్‌లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లోకి వచ్చి పోటిచేసిన కె.యస్.రత్నం నెల రోజులు తిరగకముందే తిరిగి కాంగ్రెస్‌కు బై బై చెప్పి టిఆర్‌యస్‌లో చేరడంతో ఆయన అనుచరులు మాత్రం ప్రస్తుతం ఎటు కాకుండా పరేషాన్‌లో ఉన్నారు. చెవెళ్ల, ఇబ్రహింపట్నం నియోజకవర్గాలలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే కావడం ఇటివల ఎమ్మెల్యేగా, ఎంపిగా పోటిచేసిన నేతలు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో నామమాత్రపు పోటికి పరిమితం కానున్నారు.

Notification for MPTC, ZPTC elections 2019

The post నగర శివారుల్లో నామినేషన్లకు వేళాయె.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: