మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  హైదరాబాద్ : ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టిఆర్‌ఇఐఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్‌లో అదనంగా ఈ పోస్టులను చేర్చారు. దాంతో మొత్తం 34 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ కానున్నాయి.ఈ పోస్టులకు అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఆర్‌ఇఐ-ఆర్‌బి ఛైర్మన్ […] The post మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టిఆర్‌ఇఐఆర్‌బి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఎస్‌సి గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్‌లో అదనంగా ఈ పోస్టులను చేర్చారు. దాంతో మొత్తం 34 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ కానున్నాయి.ఈ పోస్టులకు అభ్యర్థులు మార్చి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని టిఆర్‌ఇఐ-ఆర్‌బి ఛైర్మన్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.

ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు పిజిలో 55 శాతం మార్కుల అర్హత పరిమితిని ప్రస్తుతం 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఇదివరకు గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి మార్చి 10 వరకు తమ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ద్వారా ఎలాంటి పీజు లేకుండా ఆప్షన్‌ను మార్చుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040- 23317140 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

Notification for Gurukul Degree Principal posts

The post మరో 15 గురుకుల డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: