టైమ్స్ టాప్ ౩౦౦ విద్యా సంస్థలలో భారత్‌కు దక్కని చోటు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని 300 అత్యుత్తమ విద్యా సంస్థలలో భారత్‌కు చోటు దక్కలేదు. 2012 సంవత్సరం తర్వాత భారత్‌కు ఈ ర్యాంకింగ్‌లో చోటుదక్కకపోవడం ఇదే మొదటిసారి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన 2020 ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన ఏ విద్యాసంస్థకు టాప్ 300లో చోటు దక్కలేదు. గత ఏడాది టాప్ 300లో చోటు దక్కించుకున్న ఏకైక విద్యాసంస్థ బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సి) ఈ ఏడాది 301-350 గ్రూపులో పడిపోయింది. ఇదే గ్రూపులో ఐఐటి ఇండోర్ కూడా స్థానం దక్కించుకుంది. ముంబై, ఢిల్లీ, ఖరగ్‌పూర్ ఐఐటిలు 401-500 ర్యాంకింగ్ గ్రూపులో చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగవ ఏడాది ఆక్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండవ స్థానాన్ని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దక్కించుకున్నాయి. వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ, మస్సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెకాలజీ దక్కించుకున్నాయి.

 

 

Not a Single Indian Institute Ranked in Worlds Top 300 For the First Time Since 2012
Even though the IISC retained its lead among the Indian universities on the list, its ranking dropped 50 placesfrom the 251-300 ranking cohort in the previous year to the 301-350 grouping.

The post టైమ్స్ టాప్ ౩౦౦ విద్యా సంస్థలలో భారత్‌కు దక్కని చోటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.