ఈ ఆఫీసు అవినీతి రహితం

ఆమనగల్లు: రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన, అవినీతికి తావులేకుండా సమూల మార్పులు చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలతో అధికారులు అవినీతికి తావులేదంటూ సంబంధిత కార్యాలయాలలో బోర్డులను ఏ ర్పాటు చేస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, మేనేజర్ పవన్‌కుమార్‌లు ఈ ఆఫీసు అవినీతి రహిత కార్యాలయం అంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు ప్రజలు ఎవ్వరుకూడా కార్యాలయ సేవలకు డబ్బులు ఇవ్వవద్దు, మీయొక్క ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించబడునన్నారు. పన్నుల […] The post ఈ ఆఫీసు అవినీతి రహితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆమనగల్లు: రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన, అవినీతికి తావులేకుండా సమూల మార్పులు చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలతో అధికారులు అవినీతికి తావులేదంటూ సంబంధిత కార్యాలయాలలో బోర్డులను ఏ ర్పాటు చేస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, మేనేజర్ పవన్‌కుమార్‌లు ఈ ఆఫీసు అవినీతి రహిత కార్యాలయం అంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు ప్రజలు ఎవ్వరుకూడా కార్యాలయ సేవలకు డబ్బులు ఇవ్వవద్దు, మీయొక్క ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించబడునన్నారు. పన్నుల వసూళ్ళ సిబ్బంది, కార్యాలయ సెక్షన్ల సిబ్బంది, మధ్యవర్తులు డబ్బులడిగితే సిడియం, 8978311550, జిల్లా కలెక్టర్ 8008889155, రీజినల్ డైరెక్టర్ 7702775278, మున్సిపల్ కమీషనర్ 6305622374, మేనేజర్ 7207826552లకు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, మేనేజర్ పవన్‌కుమార్‌లు కోరారు.

Non Corruption Flexies at Amanagallu Municipal Office

The post ఈ ఆఫీసు అవినీతి రహితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: