ఘనంగా హోళీ సంబరాలు

  మన తెలంగాణ/ హాలియా: నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం ఘనంగా హోళీ సంబరాలను జరుపుకున్నారు. హోళీ పండుగ పురస్కరించుకుని యువకులు, విద్యార్దులు,చిన్నారులు, పెద్దలు, మహిళలు, నాయకులు అందరు కలిసి కులమతాలకు అతీతంగా ఉత్సవంగా రంగులు చల్లుకుంటూ కేరితలు కొడుతూ హోళీ సంబరాలను జరుపుకున్నారు. హాలియాలో ఉదయాన్నే యువకులు ప్రధాన రోడ్డుపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాలియాలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి హోలీని […]

 

మన తెలంగాణ/ హాలియా: నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం ఘనంగా హోళీ సంబరాలను జరుపుకున్నారు. హోళీ పండుగ పురస్కరించుకుని యువకులు, విద్యార్దులు,చిన్నారులు, పెద్దలు, మహిళలు, నాయకులు అందరు కలిసి కులమతాలకు అతీతంగా ఉత్సవంగా రంగులు చల్లుకుంటూ కేరితలు కొడుతూ హోళీ సంబరాలను జరుపుకున్నారు. హాలియాలో ఉదయాన్నే యువకులు ప్రధాన రోడ్డుపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాలియాలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి హోలీని సంబంరాలు చేసుకున్నారు. హోళీ సంబరాలలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, వద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వర్రా వెంకట్‌రెడ్డి, బొల్లేపల్లి శేఖర్‌రాజు, నరేందర్‌రావు, గడ్డం రమణయ్య, చల్లామట్టారెడ్డి, సురభి రాంబాబు, అన్వరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

హాలియా కృష్ణవేణి పాఠశాలలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధినివిద్యార్ధులు పలు రకాల రంగులను చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నిమ్మల లక్ష్మారెడ్డి, కె.జలంధర్‌రెడ్డి, ఎ.వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

 

Nomula Narsaiah Holi Celebrations in Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: