ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 విడుదల

  న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 7.2ను తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  సియాన్ గ్రీన్, చార్‌కోల్, ఐస్ రంగుల్లో విడుదలైన నోకియా ఈ స్మార్ట్ ఫోన్ 4 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ధర రూ.18599, రెండవది 6 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ధర రూ.19,599గా నిర్ణయించారు. ఈ ఫోన్‌పై జియో తన కస్టమర్లకు 7,200 విలువ చేసే వోచర్లును, నోకియా ఆన్ లైన్ స్టోర్లలో కోనుగోలు చేసిన […] The post ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: హెచ్‌ఎండి గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 7.2ను తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  సియాన్ గ్రీన్, చార్‌కోల్, ఐస్ రంగుల్లో విడుదలైన నోకియా ఈ స్మార్ట్ ఫోన్ 4 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ధర రూ.18599, రెండవది 6 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ధర రూ.19,599గా నిర్ణయించారు.

ఈ ఫోన్‌పై జియో తన కస్టమర్లకు 7,200 విలువ చేసే వోచర్లును, నోకియా ఆన్ లైన్ స్టోర్లలో కోనుగోలు చేసిన వారికి రూ.2000 విలువ గల గిఫ్ట్ కార్డ్ ను అందించనుంది. ఫ్లిప్ కార్డ్ లో హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌ ను కొనుగోలు చేసేవారికి అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఇవ్వనున్నారు. బిగ్ బిలియన్ డే సేల్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ లభించనున్నుంది.

నోకియా ఫీచర్స్:

నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫ్లాట్ ఫాంపై పనిచేసే ఈ ఫోన్ కు త్వరలో ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ ను అందించనుంది. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే హుచ్ డిఆర్ 10 సఫోర్ట్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,  48+8+5 మెగాపిక్సల్ మూడు కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి విఒఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, 3,500 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తాయి.

Nokia 7.2 Release With Triple Rear Cameras

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: