మార్కెట్లోకి నోకియా 5310

Nokia 5310 XpressMusic phone launched in India

న్యూఢిల్లీ: నోకియా ఫోన్‌ల తయారీ సంస్థ హెచ్‌ఎండి గ్లోబల్ భారతదేశం మార్కెట్లోకి నోకియా 5310ను విడుదల చేసింది. శక్తివంతమైన డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, లోపల ఉండే ఎమ్‌పి 3 ప్లేయర్, వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్, 22-రోజుల స్టాండ్-బై టైమ్, ఇలాంటి ఎన్నో సరికొత్త ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. అన్నింటికి మించి అద్భుతమైన డిజైన్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. నోకియా 5310 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించారు. ఇప్పుడు భారతదేశానికి చేరుకుంటోంది. జూన్ 16 నుండి నోకియా.కామ్, అమెజాన్.ఇన్‌లో నోటిఫై-మి కోసం అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుండి ఈ రెండు ఇ-స్టోర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. నోకియా 5310 మొదటి నాలుగు వారాల పాటు ఆన్‌లైన్‌లో లభిస్తుంది. తరువాత భారతదేశంలోని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలోఅందుబాటులో ఉంటుంది.

Nokia 5310 XpressMusic phone launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మార్కెట్లోకి నోకియా 5310 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.