మార్కెట్‌లో నోకియా 4.2

  విడుదలైన అధునాతన ఫీచర్ల స్మార్ట్ ఫోన్ ఈ నెల 13 నుంచే అన్ని బిగ్‌సి షోరూంలలో లభ్యత ధర కేవలం రూ. 10,990 10శాతం క్యాష్ బ్యాక్ సౌకర్యం హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటి బిగ్‌సి షోరూం నందు శనివారం నోకియా 4.2 అధునాతన ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌ను విడుదలైంది. శనివారం హైటెక్ సిటి బిగ్ సి షోరూంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, సిఏండి యం.బాలు చౌదరి, హెచ్‌ఎండి గ్లోబల్ జనరల్ మేనేజర్ -సౌత్ టి.ఎస్.శ్రీధర్ […] The post మార్కెట్‌లో నోకియా 4.2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విడుదలైన అధునాతన ఫీచర్ల స్మార్ట్ ఫోన్
ఈ నెల 13 నుంచే అన్ని బిగ్‌సి షోరూంలలో లభ్యత
ధర కేవలం రూ. 10,990
10శాతం క్యాష్ బ్యాక్ సౌకర్యం

హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటి బిగ్‌సి షోరూం నందు శనివారం నోకియా 4.2 అధునాతన ఫీచర్ల స్మార్ట్‌ఫోన్‌ను విడుదలైంది. శనివారం హైటెక్ సిటి బిగ్ సి షోరూంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, సిఏండి యం.బాలు చౌదరి, హెచ్‌ఎండి గ్లోబల్ జనరల్ మేనేజర్ -సౌత్ టి.ఎస్.శ్రీధర్ లు నోకియా 4.2మొబైల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ ప్రముఖ మొబైల్ కంపెనీ నోకియా 4.2 ఎపి,తెలంగాణల్లో బిగ్‌సి ద్వారా మార్కెట్‌లో విడుదల తమకెంతో ఆనందంగాను, గర్వంగాను ఉందన్నారు. నోకియా 4.2 మొబైల్ హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కోనుగోలు పై 10శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని తెలిపారు. అలాగే రూ.3,500 విలువగల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఉచితంగా లభిస్తుందన్నారు. ఈ మొబైల్‌ను ప్రి బుక్ చేసుకున్న కస్టమర్లందరికి పై ఆఫర్లతొ బాటుగా జిబ్రొకాన్స్ బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా లభిస్తుందని పేర్కోన్నారు. బిగ్‌సి సంస్థ ఫౌండర్, సిఎండి.శ్రీయం.బాలు చౌదరి మాట్లాడుతూ మార్కెట్‌లో పేరుపోందిన మొబైల్ కంపెనీలన్నీ తమ నూతన మోడళ్ళను బిగ్‌సి ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఆసక్తిని చూపిస్తాయని, అతుత్తమ వ్యాపార విలువలు, ప్రజాదరణ కల్గిన బిగ్‌సి ద్వారా నూతన మొబైల్ ఉత్పత్తులను విడుదల చేస్తే ప్రజలు ఆ ఉత్పత్తులను విశ్వసిస్తారని అభిప్రాయపడ్డారు. నమ్మకమైన సంస్థగా ముద్రపడిన బిగ్ సిద్వారా మొబైల్స్ ప్రజలకు చేరువకావడం ఎంతో సులభమని , అందుకే ప్రతి మొబైల్ కంపెనీ తమ ఉత్పత్తులను ముందుగా బిగ్ సి ద్వారా పరిచయం చేయడం ఓ ఆనవవాయితీగా సాగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే నోకియా సంస్థ పలు నూతన మోడల్స్‌ను బిగ్ సి ద్వారానే మార్కెట్‌లోకి విడుదల చేసిందన్నారు. ఇప్పు డు అధునాతన ఫీచర్లు ఉన్న నోకియా 4.2మొబైల్ కూడా ఎ.పి, తెలంగాణలో బిగ్.సి స్టోర్స్ ద్వారానే ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ సి డైరక్టర్లు వై.స్వప్నకుమార్, కైలాష్ లఖ్యాని తదితరులు పాల్గొన్నారు.

మే 13 నుంచే అందుబాటులోకి…
నోకియా సంస్థ ద్వారా అత్యాధునికమైన ఫీచర్లు కల్గిన నోకియా 4.2మొబైల్ ఈ నెల 13వ తేది నుంచి తెలంగాణ, ఎపి.బిగ్ సి స్టోర్స్ నుందు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నూతన మొబైల్ ధర రూ.10,990గా ఉంది.

అత్యాధునిక ఫీచర్లు ఇవే

బిగ్ సి సంస్థ ద్వారా శనివారం మార్కెట్‌లో విడుదలైన నోకియా 4.2స్మార్ట్ ఫోన్ అనేక అత్యాధునిక ఫిచర్లు కల్గి ఉంది. స్క్రిన్ 5.71,3జిబి ర్యామ్,32జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 400జిబి మోమరీ,3000 వాట్స్ బ్యాటరి,డ్యూయల్ కెమెరా,ఎల్‌యిడి ప్లాష్ తదితర అనేక ప్రత్యేక ఫిచర్లు నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ కే సొంతం.

Nokia 4.2 launched in High Tech city Big C showroom

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మార్కెట్‌లో నోకియా 4.2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: