రూ.2,480 కే నోకియా ఫోన్

ముంబయి: హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నోకియా 210 ఫీచ‌ర్ ఫోన్ ను ఎండ‌బ్ల్యూసీ 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో రిలీజ్ చేసింది. 2.4 ఇంచుల డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ లో డ్యుయ‌ల్ సిమ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే ఇందులో కేవ‌లం 2జి మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫేస్‌బుక్, స్నేక్ గేమ్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 16 ఎంబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. వెనుక భాగంలో విజిఎ కెమెరా ఉంది. అంతే కాకుండా […]

ముంబయి: హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నోకియా 210 ఫీచ‌ర్ ఫోన్ ను ఎండ‌బ్ల్యూసీ 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో రిలీజ్ చేసింది. 2.4 ఇంచుల డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ లో డ్యుయ‌ల్ సిమ్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే ఇందులో కేవ‌లం 2జి మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఫేస్‌బుక్, స్నేక్ గేమ్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 16 ఎంబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. వెనుక భాగంలో విజిఎ కెమెరా ఉంది. అంతే కాకుండా ఇందులో ఫ్లాష్ స‌దుపాయం క‌ల్పించారు.

నోకియా 210 ఫీచర్లు…

ఫోన్‌లో ఎఫ్ఎం రేడియో, ఎంపి3 ప్లేయ‌ర్‌, 1020 ఎంఎహెచ్ బ్యాట‌రీ, 20 రోజుల స్టాండ్ బై టైం, మైక్రో యుఎస్‌బి పోర్టు వంటి అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ చార్‌కోల్‌, రెడ్‌, గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో రిలీజ్ కాగా, దీని ధ‌ర రూ.2,480 గా నిర్ణయించింది సంస్థ. వ‌చ్చే వారంలో ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

nokia 210 is feature phone launch

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: