కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

Nobel Prizeస్వీడన్ : కెమిస్ట్రీలో ముగ్గురిని నోబెల్ అవార్డు వరించింది. కెమిస్ట్రీలో ఈ ఏడాది జాన్ బీ గుడెనాఫ్‌, ఎం స్టాన్లీ విట్టింగ్‌హామ్‌, అకిరా యొషినోలు నోబెల్ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. లిథియం ఐయాన్ బ్యాట‌రీల‌ను అభివృద్ధి ప‌రిచినందుకు ఈ ముగ్గురికి నోబెల్ వచ్చింది. వీరు రూపొందించిన లిథియం బ్యాట‌రీలు ప్ర‌జ‌ల జీవితాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొంది. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు … ఇలా అన్నింటిలోనూ లిథియం బ్యాట‌రీల‌నే వాడుతున్న‌ట్లు నోబెల్ సంస్థ వెల్లడించింది.

Nobel Prize For Three In Chemistry

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.