పదకొండో సారీ రూ.15 కోట్లే..

Mukesh-Ambaniపెరగని ముకేశ్ అంబానీ వేతనం

ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ వేతనం ఎంతో మీకు తెలుసా? ఏడాది 15 కోట్ల రూపాయలు.. పదకొండు సంవత్సరాలు ఆయన ఇదే వేతనాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం కూడా ముకేశ్ అంబానీ వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. 2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించడం లేదు. అంటే సంవత్సరానికి రూ.24 కోట్లను వదులుకుంటున్నారు. కాగా 2019 మార్చి 31 ముగింపు ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని పూర్తి కాలం డైరెక్టర్ల జీతం భారీగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ.20.57 కోట్లకు పెరిగింది.

ఇది 2017-18లో రూ.19.99 కోట్లు, 2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం గత ఏడాదితో పోలిస్తే రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది. నీతా అంబానీతో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ.1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .1.3 కోట్లు మాత్రమే. అయితే 2018 అక్టోబర్ 17న ఆర్‌ఐఎల్ బోర్డులోమాజీ ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య రూ.75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు.

No salary hike for Mukesh Ambani

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పదకొండో సారీ రూ.15 కోట్లే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.