రద్దు చేయం.. సమయం ఇవ్వం

Ravi-Shankar-Prasad

 

టెలికాం సంస్థల ఎజిఆర్ బకాయిలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల ఎజిఆర్(సర్దుబాటు స్థూల రాబడి) బకాయిల చెల్లింపులను రద్దు చేసే ఆలోచనేమీ లేదని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే బకాయిల చెల్లింపులకు టెలికాం సంస్థల కు సమయం ఇచ్చే ప్రతిపాదనకూడా లేదని స్పష్టం చేశా రు. పార్లమెంట్‌లో ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అలాగే చెల్లించని సుంకాలపై మంత్రి స్పందిస్తూ, కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ టెలికాం రంగం లో సమస్యలపై చర్చిస్తుందని అన్నారు. టెలికామ్ సంస్థ లు ఎజిఆర్ బకాయిలను చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది.

కోర్టు ఈసంస్థలకు మూడు నెలల గడువు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాతున్న టెలికామ్ సంస్థలు ఈ ఎజిఆర్ బకాయిలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండు త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ లు 70 కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో బకాయిలకు నిధులను కేటాయిస్తే కంపెనీల భవిష్యత్ డైలమాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ప్రభుత్వం ఏజిఆర్ బకాయిల చెల్లింపులపై ఉపశమనం ఇస్తుందనే ఆశతో ఉన్నాయి. బకాయిలు చెల్లించాల్సిందేనని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేయడంతో ఈ సంస్థలు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డిసెంబర్ నుంచి చార్జీల ను పెంచనున్నట్టు ఈ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకు కట్టుబడి వున్నాం
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఆరోగ్యం పట్ల సీరియస్‌గా ఉన్నామని, సంస్థ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. పార్లమెంట్ ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘బిఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ దిశగా పనిచేస్తున్నాం, లాభాల్లోకి తీసుకొస్తాం’ అని అన్నారు. నష్టాలతో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లను విలీనం చేయనున్నామని, అలా గే ఈ సంస్థల కోసం రూ.69 వేల పునరుద్ధరణ ప్యాకేజీకి గత నెలలో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ యోచన లేదు
వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ను అనుసంధానం చేసేం యోచనేమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ను అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రశ్నకు ఆయన ఈవిధంగా సమాధానమిచ్చా రు. ‘సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదు’ అని అన్నారు.

No proposal to waive AGR penalties on telecom companies

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రద్దు చేయం.. సమయం ఇవ్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.