జనవరి నుంచి నెఫ్ట్ లావాదేవీలపై చార్జీలుండవ్

NEFT
ఆర్‌బిఐ ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది(2020) జనవరి నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలు ఉండవు. ఈమేరకు బ్యాంక్‌లకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆదేశాలు జారీ చేసింది. 2020 జనవరి 1 నుంచి బ్యాంక్ సేవింగ్ ఖాతాదారులు నెఫ్ట్ సేవలను ఎలాంటి చార్జీలు లేకుండా వినియోగించుకోవచ్చు. నెఫ్ట్, ఆర్‌టిజిఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) లావాదేవీలపై చార్జీలను తొలగిస్తామని గతంలోనే రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఆర్‌టిజిఎస్ విధానంలో భారీ మొత్తంలో నిధుల బదిలీ ఉంటుంది, అలాగే నెఫ్ట్ విధానంలో రూ.2 లక్షల వరకు నగదు ను బదిలీ చేయవచ్చు. డీమానిటైజేషన్(నోట్ల రద్దు) చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ మధ్య 96 శాతం నగదు యేతర రిటైల్ చెల్లింపులు జరిగాయి.

రూ.2 వేల నోటును రద్దు చేయడమే మేలు

డీమోనిటైజేషన్(నోట్ల రద్దు) ప్రకటన చేసిన మూడే ళ్ల అయిన సందర్భంగా ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ రూ.20 వేల నోట్లను రద్దు చేయడం మేలని అన్నారు. రూ.2000 నోట్ల లో ఎక్కువ భాగం చెలామణిలో లేవని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో చాలా నగదు ఉంది. 2000 నోట్లను మూసివేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ధోరణి పెరుగుతోంద ని గార్గ్ చెప్పారు. భారతదేశంలో ఈ వేగం నెమ్మది గా ఉందని, ఇక్కడ 85 శాతం చెల్లింపులు నగదు రూపంలో జరుగుతున్నాయన్నారు.

నగదు లావాదేవీల పై పన్నులు లేదా ఫీజులు లేకుండా చేయడం, డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడం వంటి చర్యలు దేశాన్ని నగ దు రహితంగా మార్చడానికి సహాయపడతాయని గార్గ్ సూచించారు. నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 2016 నవంబర్ 8న డీమోనిటైజేషన్ ప్రకటించింది. ఆ సమయంలో 500, 1000 రూపాయల నోట్లను నిలిపివేశారు. వీటికి బదులుగా 500 కొత్త నోటు జారీ చేశారు. ప్రభు త్వం 1000 నోటును పూర్తిగా రద్దు చేసి మొదటిసారిగా 2000 నోటును జారీ చేసింది.

No levying of charges on NEFT payment from January

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జనవరి నుంచి నెఫ్ట్ లావాదేవీలపై చార్జీలుండవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.