హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య లేదు : సిపి అంజనీకుమార్

CP Anjani Kumarహైదరాబాద్‌ : హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల సమస్య లేదని సిపి అంజనీకుమార్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒయు పోలీసు స్టేషన్ లో ఆదివారం పోలీసుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపి అంజనీకుమార్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు. గతంలో పోలీసులు అంటే ప్రజల్లో ఉన్న అపోహను తొలగించామని ఆయన పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన వెల్లడించారు.  శాంతిభద్రతల సమస్య అదుపులో ఉండడం వల్లనే ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు తరలి వచ్చాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే, అందులో పోలీసుల కృషి కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల సాధనలో కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే శాంతిభద్రతల స్థాపన సాధ్యమన్న విషయాన్ని ప్రతి పోలీసు గుర్తు పెట్టుకోవాలని ఆయన తేల్చి చెప్పారు.

No Law And Order Problem In Hyderabad City : CP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హైదరాబాద్ లో శాంతిభద్రతల సమస్య లేదు : సిపి అంజనీకుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.