థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదు: స్టాలిన్

  చెన్నై: లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి అవకాశం లేదని డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కెసిఆర్ సోమవారం చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో […] The post థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదు: స్టాలిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెన్నై: లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి అవకాశం లేదని డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన మరుసటి రోజే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కెసిఆర్ సోమవారం చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఇందుకోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలకాలని ఈ సమావేశం సందర్భంగా స్టాలిన్‌ను కెసిఆర్ కోరినట్లు వార్తలు వచ్చాయి.

అయితే కెసిఆర్‌తో భేటీ అయిన మరుసటి రోజే సమాఖ్య కూటమిపై స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ లేకుండా మూడో కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తనకు అనిపించడం లేదని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ చెప్పారు. అయితే మే 23వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. అంతేకాక సమాఖ్య కూటమికి మద్దతు కోరేందుకు కెసిఆర్ చెన్నై రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని కూడా ఆయన చెప్పారు. ‘ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన (కెసిఆర్) ఇక్కడికి రాలేదు. ఆలయాల దర్శనం కోసం ఆయన తమిళనాడు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆయన నా అపాయింట్‌మెంట్ కోరారు. అంతే’ అని స్టాలిన్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

No chance of federal front says DMK Stalin

The post థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదు: స్టాలిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: