మోడీపై పోటీకి పసుపు రైతులు సిద్ధం

నిజామాబాద్ : నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటును  డిమాండ్ చేస్తూ నిజామాబాద్ పసుపు రైతులు తొలివిడత లోక్ సభ ఎన్నికల్లో నిజాబాద్ స్థానానికి భారీగా పోటీ చేశారు. 185మంది రైతులు ఈ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రైతులు వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నేతృత్వంలో 50 మంది రైతులు […] The post మోడీపై పోటీకి పసుపు రైతులు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్ : నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటును  డిమాండ్ చేస్తూ నిజామాబాద్ పసుపు రైతులు తొలివిడత లోక్ సభ ఎన్నికల్లో నిజాబాద్ స్థానానికి భారీగా పోటీ చేశారు. 185మంది రైతులు ఈ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రైతులు వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నేతృత్వంలో 50 మంది రైతులు ’చలో వారణాసి‘ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు వారణాసికి వెళుతున్నట్టు ఆయన తెలిపారు. వారణాసి ఎంపి స్థానానికి ఇండిపెండెంట్లుగా తాము నామినేషన్ వేస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పంటకు గిట్టుబాటు ధర సాధించాలన్న ఆలోచనతోనే తాము వారణాసిలో ఎన్నికల ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. తమ డిమాండ్ ను కాంగ్రెస్, బిజెపిలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత లక్ష్యంగా తాము ప్రచారం చేశామని, దీంతో తమ అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని ఆయన చెప్పారు. పసుపు బోర్డు కోసం కవిత ఐదేళ్ల పాటు ఢిల్లీలో పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. తమకు మద్ధతుగా తమిళనాడు నుంచి కూడా కొందరు రైతులు వారణాసికి వస్తున్నారని ఆయన వెల్లడించారు.

Nizamabad Farmers Contest on PM Narendra Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీపై పోటీకి పసుపు రైతులు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: