నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ పదవీకాలం పొడగింపు

 CEO Amitabh Kant

 

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. ఆయన పదవీ కాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. జూన్ 30 తర్వాత నీతి ఆయోగ్ సిఇఒగా మరో రెండేళ్లు పొడిగించారని, 2021 జూన్ 30 వరకు ఆయన కొనసాగుతారని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2016 ఫిబ్రవరి 17న అమితాబ్‌ను రెండేళ్ల కాలపరిమితితో నీతి ఆయోగ్‌కు సిఇఒగా నియమించారు. ఆ తర్వాత 2019 జూన్ 30 వరకు పదవీకాలాన్ని పొడిగించారు. నీతి ఆయోగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) సిఇఒగా అమితాబ్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ శాఖ కార్యదర్శిగా సేవలందించారు.

NITI Aayog CEO Amitabh Kant gets 2 year extension

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ పదవీకాలం పొడగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.