మహేష్, బన్నీ తర్వాత అనుష్క సందడి..

 

హైదరాబాద్: టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘నిశ్శబ్దం’.  ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి పాత్రలో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిమాకు హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో మాధవన్, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరగుతుంది.  ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ ని కూడా విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అనుష్క అభిమానులకు యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘నిశ్శబ్దం’ సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రాలు.. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురంలో’ తర్వాత అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nishabdam Movie Unit Announced release date

The post మహేష్, బన్నీ తర్వాత అనుష్క సందడి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.